Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు!

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు!

  • -ఖ‌మ్మం జిల్లా గ్రానైట్‌తో రూపొందిన నేతాజీ విగ్ర‌హం
  • -సెంట్ర‌ల్ విస్టా ఎవెన్యూను ప్రారంభించిన మోదీ
  • -వేడుక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మం

-గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది
-మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా -ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ
-రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు
-బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు

ఖమ్మం కు చెందిన గ్రానైట్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఖమ్మం లోని గాయత్రీ సంస్థల యజమాని , టీఆర్ యస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర క్వారి నుంచి బ్లాక్ గ్రానైట్ ను గతంలో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం నుంచి అమరాజవాన్ల స్మారక స్తూపం కోసం పెద్ద గ్రానైట్ ను వద్దిరాజు రవిచంద్ర పంపించారు . దానికోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు . అప్పుడు దేశంలోనే ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ విగ్రహానికి ఉపయోగించిన బ్లాక్ గ్రానైట్ కూడా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇవ్వడం విశేషం . అయితే దీన్ని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామం నుంచి పంపడం జరిగింది. గత ఏడాది ఢిల్లీ చాణక్యపురి పోలీసు జాతీయ అకాడమీలో నెలకొల్పిన స్మారక స్తూపం ఏర్పాటు చేయగా … ఢిల్లీలో ఖమ్మం జిల్లా లోని గాయత్రీ కంపెనీ నుంచి మరో గ్రానైట్ రాయి ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు కు వినియోగించడం విశేషంగా చెప్పుకుంటున్నారు . ఇంత పెద్ద గ్యాంగ్ సాల్ గ్రానైట్ రాళ్లను అందించిన గాయత్రీ గ్రానైట్ అధినేత ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పలువురు ప్రముఖులు అభినందించారు . ఖమ్మం జిల్లాలో దొరుకుతున్న గ్రానైట్ గురించి దేశ విదేశాలలో ప్రచారం కావడం పట్ల ఇక్కడ గ్రానైట్ అసోషియేషన్ నాయకులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు .

క‌ర్త‌వ్య ప‌థ్‌గా మారిన రాజ్ ప‌థ్‌… నేతాజీ విగ్ర‌హాన్ని ప్రారంభించిన మోదీ

pm modi unviels netaji statue in delhi

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంటు, రాష్ట్రప‌తి భ‌వ‌న్, ఇండియా గేట్‌ ప‌రిస‌రాల్లో ఇన్నాళ్లూ రాజ్ ప‌థ్‌గా కొన‌సాగిన చారిత్రక ప్రాంతం గురువారం ‘క‌ర్త‌వ్య ప‌థ్‌’గా త‌న పేరు మార్చుకుంది. రాజ్ ప‌థ్‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాల‌ను చేరుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా క‌ర్త‌వ్య ప‌థ్‌లోనే 28 అడుగుల ఎత్తున స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్ర‌హాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది.

నేతాజీ విగ్ర‌హాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ… ఆ వెంట‌నే క‌ర్త‌వ్య ప‌థ్‌కు లాంఛ‌నంగా ప్రారంభోత్స‌వం చేశారు. ఖ‌మ్మం జిల్లాలో దొరికే గ్రానైట్‌తో నేతాజీ విగ్ర‌హాన్ని ప్ర‌ముఖ శిల్పి అరుణ్ యోగ‌రాజ్ చెక్కారు. ఈ విగ్ర‌హం ద్వారా దేశంలోని అత్యంత ఎత్తైన ఏక‌శిలా విగ్ర‌హాల జాబితాలో నేతాజీ విగ్ర‌హం కూడా చేరింది. నేతాజీ విగ్ర‌హం, క‌ర్త‌వ్య ప‌థ్‌ల‌తో పాటు సెంట్ర‌ల్ విస్టా ఎవెన్యూను కూడా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

 

Related posts

23న సేవ్ జర్నలిజం డే-ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం

Drukpadam

కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం!

Drukpadam

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

Drukpadam

Leave a Comment