Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బాబూ ట్యాక్సీ కావాలా”… అంటూ అడిగిన అధ్యక్షుడు బైడెన్… 

“బాబూ ట్యాక్సీ కావాలా”… అంటూ అడిగిన అధ్యక్షుడు బైడెన్… 

  • డెట్రాయిట్ లో ఆటో షో
  • హాజరైన జో బైడెన్
  • కాడిలాక్ ‘లిరిక్’ కారులో షికారు
  • వైరల్ అవుతున్న వీడియో

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెట్రాయిట్ లో నిర్వహించిన ఆటోమొబైల్ షోకి హాజరయ్యారు. కాడిలాక్ కొత్త హైఎండ్ కారు ‘లిరిక్’ లో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా, ఆటో ఎక్స్ పోకి వచ్చినవారితో సరదాగా వ్యాఖ్యానించారు.

కాడిలాక్ కొత్త మోడల్ డ్రైవర్ సీట్లో కూర్చున్న బైడెన్… అక్కడున్న వారిని చూసి, “బాబూ ట్యాక్సీ కావాలా… వాషింగ్టన్ వెళుతుంది… వస్తారా?” అంటూ పక్కా ట్యాక్సీవాలా తరహాలో అడిగారు. దాంతో అక్కడున్న ప్రజలు, ఫొటోగ్రాఫర్లు, మీడియా రిపోర్టర్లు ముసిముసినవ్వులతో ప్రెసిడెంట్ వ్యాఖ్యలను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కాగా, డెట్రాయిట్ ఆటో షోలో ప్రధానంగా గాసోలిన్ ఇంధనంతో నడిచే కార్లను ప్రదర్శించారు. బైడెన్ షికారు చేసిన కాడిలాక్ లిరిక్ కారు కూడా గాసోలిన్ తోనే నడుస్తుంది. దీని ధర రూ.49 లక్షల వరకు ఉంటుంది.

Related posts

బీజేపీ నేతలు కలలు కంటున్నారు.. మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం!: గుత్తా సుఖేందర్ రెడ్డి!

Drukpadam

రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!

Drukpadam

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్..!

Drukpadam

Leave a Comment