భారత్ జోడో యాత్రలో కొడుకు రాహుల్ తో కలిసి అడుగులేసిన సోనియా గాంధీ!
-తల్లి కాళ్లకు కట్టుకున్న లేసులు ఊడటంతో స్వయంగా కిందకు వంగి కట్టిన రాహుల్
-ఎక్కువదూరం తల్లిని నడవద్దని వారించిన రాహుల్ గాంధీ
-కర్ణాటకలో జోడో యాత్రకు ప్రజల బ్రహ్మరథం
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో సాగుతుంది.తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కేరళ రాష్ట్రము పూర్తీ చేసుకొని ప్రస్తుతం కర్ణాటకలో సాగుతుంది. ఈ యాత్రలో కు రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తుండగా ,గురువారం రోజున ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ తో కలిసి అడుగులు వేశారు . ఈ సందర్భంగా తనతల్లి సోనియా షూ లేదు ఊడిపోగా రాహుల్ గాంధీ దాన్ని గమనించి తన తల్లికి లేసులు కట్టారు . ఈ సిన్ వైరల్ గా మారింది.అంతేకాకుండా సోనియా ఆరోగ్యరీత్యా ఆమె ఎక్కువ దూరం నడవద్దని రాహుల్ వరించి కారు ఎక్కించారు .
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర- ఇవ్వాళ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర కొనసాగుతోంది. దసరా పండగను పురస్కరించుకుని రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రను చేపట్టలేదు. 4, 5 తేదీల్లో దీన్ని నిర్వహించలేదు. ఈ ఉదయం మండ్య జిల్లాలోని పాండవపురలో యాత్రను చేపట్టారు. సాయంత్రానికి రామనగర జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉంది.
కిందటి నెల 30వ తేదీన అడుగు పెట్టారు రాహుల్ గాంధీ కర్ణాటకలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటెలో ఆయన కేరళ సరిహద్దులను దాటారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. భారత్ జోడో యాత్రను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదే స్థాయిలో నిర్వహిస్తోన్నారు.
మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ వైరల్‌గా మారింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇవ్వాళ ఈ యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారు జామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. ఆమెతో కలిసి నడక మొదలు పెట్టారు.
మూడు రోజుల కిందటే సోనియా గాంధీ కర్ణాటకకు చేరుకున్న విషయం తెలిసిందే. మడికెరి, మైసూరుల్లో బస చేశారు. విజయదశమి సందర్భంగా మైసూరు జిల్లాలోని బేగూర్ వద్ద గల ప్రఖ్యాత భీమనకొల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇదే యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడూ యాత్రలో కలుస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.
కర్ణాటకలో సుదీర్ఘంగా కొనసాగనుంది భారత్ జోడో యాత్ర. 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర కర్ణాటక మీదుగా ఈ యాత్ర సాగనుంది. బీజేపీ పాలిత రాష్ట్రం.. కర్ణాటక. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక గాంధీ పాల్గొనబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.