Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే అత్యధికకాలం 22 సంవత్సరాలు జీవించిన శునకం మృతి!

పెబ్బుల్స్​.. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న శునకం.. రికార్డు సృష్టించి కన్నుమూసింది

  • 2000వ సంవత్సరం మార్చి 28న పుట్టిన పెబ్బుల్స్
  • అప్పటి నుంచీ ఒకే కుటుంబంలో భాగంగా మారిన శునకం
  • ఎక్కువకాలం జీవించిన శునకంగా గిన్నిస్ బుక్ లో నమోదు
  • సాధారణంగా శునకాల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లే

సాధారణంగా శునకాల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లు ఉంటుంది. కొన్ని రకాల శునకాలు అయితే 18 ఏళ్ల వరకు జీవిస్తుంటాయి. అంతకు మించి జీవించడం అత్యంత అరుదు. కానీ అమెరికాలో ఓ శునకం ఏకంగా 22 ఏళ్లకు పైగా జీవించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. కానీ ఇటీవలే కన్నుమూసింది. గిన్నిస్ బుక్ సంస్థే ఈ విషయాన్ని ప్రకటించింది కూడా.

పెబ్బుల్స్ పేరుతో..
ప్రపంచంలో అత్యధిక వయసున్న పెంపుడు శునకం ‘పెబ్బుల్స్’ మరణించింది. అమెరికాలోని న్యూయార్క్ పరిధిలోని లాంగ్ ఐలాండ్ లో 2000వ సంవత్సరం మార్చి 28న పెబ్బుల్స్ పుట్టింది. ‘టాయ్ ఫాక్స్ టెర్రియర్’ జాతికి చెందిన ఈ శునకాన్ని బాబీ, జూలీ గ్రెగరీ దంపతులు పెంచుకుంటున్నారు. అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో సోమవారం రోజున పెబ్బుల్స్ శునకం కన్నుమూసింది. 22 ఏళ్ల ఐదు నెలల పాటు జీవించిన పెబ్బుల్స్.. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించిన పెంపుడు శునకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదవడం గమనార్హం. ఈ శునకం పుట్టినప్పటి నుంచి ఒకే కుటుంబం వద్ద ఉంది.

మ్యూజిక్ అంటే ఇష్టమట
పెబ్బుల్స్ శునకం ఏకంగా 23 ఏళ్లకు పైగా బతకడంతో దాన్ని పెంచుకుంటున్న కుటుంబంలో అది కూడా ఓ భాగంగా మారిపోయింది. ఇల్లంతా తనదే అన్నట్టుగా తిరిగేదని.. మ్యూజిక్ అంటే కూడా ఇష్టపడేదని దాని యజమాని జూలీ గ్రెగరీ చెప్పారు.

Related posts

దేశంలో కరోనా టీకాల కొరతకు కేంద్రమే కారణం: సీరమ్ అధికారి

Drukpadam

ఇకపై కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట…

Drukpadam

Interior Designer Crush: Richard Long of Long & Long Design

Drukpadam

Leave a Comment