Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బిగ్ బాస్ రద్దుచేయాల్సిందే ….ఇందులో అశ్లీలత ఉంది …కోర్టులో వాదనలు!

బిగ్ బాస్ రద్దుచేయాల్సిందే ….ఇందులో అశ్లీలత ఉంది …కోర్టులో వాదనలు!
-బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో విచారణ…హోస్ట్ నాగార్జునకు నోటీసులు
-బిగ్ బాస్ ను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్
-పిటిషన్ పై గురువారం మూడో విడత విచారణ చేపట్టిన కోర్టు
-నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
-3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

బిగ్ బాస్ ఇది టీవీ లలో వివిధ భాషల్లో వస్తున్నా ఎంటటైన్మెంట్ ప్రోగ్రాం షో …ఇప్పటివరకు తెలుగులో ఐదు ఎపి షోడ్ లు అయిపోగా ప్రస్తుతం ఆరో ఏపీ షోడ్ నడుస్తున్నసంగతి తెలిసిందే . అయితే దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో ఇది ఒక బూతుల ప్రపంచంగా అభివర్ణించారు. షో నిర్వహిస్తున్న ప్రముఖ హీరో నాగార్జునపై నిప్పులు చెరిగారు . దీనిపై వస్తున్నా విమర్శలకు నాగార్జున సైతం తనదైన శైలిలో ప్రతిస్పందించారు . ప్రజాప్రయోజనాల పిటిషన్ ఏపీలో హైకోర్టు లో దాఖలైంది. దానిపై రెండు సార్లు విచారణ జరగ్గా మూడవ విడత విచారణ జరుగుతుంది. షో నిర్వాహకులతోపాటు హోస్ట్ నాగార్జునకు ,ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని… ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటషన్ పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీజులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు… నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల‌ మరింత ఆలస్యం…

Drukpadam

వనమా వర్సెస్ జలగం …కొత్తగూడెం ఎమ్మెల్యేపై డైలమా …?

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ స్కాం ..డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్…!

Drukpadam

Leave a Comment