Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు టీఆర్ యస్ గెలుపులో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర కీలకం …?

మునుగోడు టీఆర్ యస్ గెలుపులో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర కీలకం …?
-సిపిఐ,సిపిఎం లు అధికార టీఆర్ యస్ కు మద్దతు
-బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేసిన లెఫ్ట్ పార్టీలు
-తమకున్న ఓట్లను టీఆర్ యస్ కు అనుకూలంగా బదలాయించిన పార్టీలు
-వారి మద్దతు లేకపోతె టీఆర్ యస్ ఆశలు గల్లంతే

మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపెవరిది ? టీఆర్ యస్సా..? లేక బీజేపీదా..? అనే చర్చ జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ sarvey ల ప్రకారం టీఆర్ యస్ గెలవబోతుందని స్పష్టం అవుతుంది. అయితే సర్వే ల లెక్కలు అన్ని నిజమౌతాయా? లేదా అనేది విషయం పక్కన పెడితే …టీఆర్ యస్ గెలిస్తే మాత్రం ఆ గెలుపు క్రెడిట్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఇవ్వాల్సిందే …కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా కేవలం బీజేపీని ఓడించగలిగిన శక్తి ఒక్క టీఆర్ యస్ కె ఉందని నమ్మిన వామపక్షాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, క్యాడర్ ను కన్విన్స్ చేయడంతో పాటు మునుగోడు లో టీఆర్ యస్ గెలుపుకోసం రాష్ట్ర నాయకులు సైతం శ్రమించారు .గతంలో సిపిఐ అక్కడ ఐదు సార్లు ,గెలుపొందింది. సిపిఎం కు క్యాడర్ బలం ఉంది. హోరా హోరీగా జరిగిన పోరులో లెఫ్ట్ పార్టీలు టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించడం అదనపు బలాన్ని ఇచ్చింది. వామపక్షాల మద్దతు లేకపోతె అధికారంలో ఉన్న టీఆర్ యస్ లో ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చేది . లెఫ్ట్ పార్టీల మద్దతు టీఆర్ యస్ కు ఆక్సిజన్ లా పనిచేసింది .దానితో వామపక్షాల మద్దతుతో టీఆర్ యస్ పార్టీకి ఓటు వేసేందుకు ఉగిసలాడిన వారు సైతం టీఆర్ యస్ కే వేయాలనే నిర్ణయానికి వచ్చారు .

కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పాల్వాయి స్రవంతి సైతం రంగంలో ఉన్నప్పటికీ వారి పార్టీ నుంచే సరైన సహకారం లభించలేదు .అయినప్పటికీ ఆమె ఒంటరి పోరు నిర్వహించారు .ఆమె పట్ల ప్రజల్లో సానుభూతి ఉన్నా వనరులు లేక చతికల బడిందనే అభిప్రాయలు ఉన్నాయి. అయినప్పటికీ శక్తి మేరకు పోటీ ఇచ్చారు . వనరులు పార్టీ సహకారం ఉంటె ఆమె ఇంకా మంచి పోటీ ఇచ్చేవారని అభిప్రాయలు రాజకీయ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. ఇక బీజేపీ ,టీఆర్ యస్ లు హోరా హోరీగా జరిగిన పోటీలో డబ్బు ,మద్యం వేరులై పారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడ ఎవరు గెలుస్తారనే అభిప్రాయలు తెరదించుతూ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి.అయితే బీజేపీ కూడా తామే గెలుస్తామని తమ అంచనా ప్రకారం తమ గెలుపు తిరుగులేదని సర్వే లను తాము పట్టించుకోవడంలేదని విజయం తమదే అని ఘంటాపధంగా చెబుతున్నాయి.

Related posts

శరద్ పవార్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి…!

Drukpadam

నదీ జలాల పేరుతో కేసీఆర్, జగన్ విద్వేషాలు: తమ్మినేని వీరభద్రం…

Drukpadam

నా ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి: కిరణ్ కుమార్ రెడ్డి..

Drukpadam

Leave a Comment