Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా నిర్ధారణ కోసం అందరికీ సిటీ స్కాన్‌ అవసరం లేదు…. ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా

కరోనా నిర్ధారణ కోసం అందరికీ సిటీ స్కాన్‌ అవసరం లేదు..

దీనివల్ల క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది: ఎయిమ్స్‌ చీఫ్‌

  • కరోనా నిర్ధారణ కోసం అందుబాటులో పలు పరీక్షలు
  • కొంతమంది కావాలనే సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు
  • తొలి దశలో చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం
  • స్వల్ప, మోతాదు లక్షణాలున్న వారికి స్కానింగ్‌ అవసరమే లేదు
  • ఒక్క స్కాన్‌ 300-400 ఎక్సరేలతో సమానం
  • ఆసుపత్రిలో చేరి వైద్యులు సూచిస్తేనే సిటీ స్కాన్‌కు వెళ్లాలి
CT Scan is not necessary for everyone

కరోనా నిర్ధారణ కోసం పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అందులో ర్యాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. అయితే, కొంత మంది సీటీ స్కాన్‌ చేయించుకొని కూడా నిర్ధారించుకుంటున్నారు. మరికొంత మంది పాజిటివ్‌ అని తేలిన తర్వాత తీవ్రతను తెలుసుకునేందుకు, ఊపిరితిత్తులపై దీని ప్రభావం ఎంతమేర ఉందని తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌కు వెళుతున్నారు.

అయితే, అందరూ సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. అసలు పాజిటివ్‌ తేలగానే స్కానింగ్ చేయించడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదని స్పష్టం చేశారు. లక్షణాలు లేనప్పటికీ కొంతమందిలో సీటీ స్కాన్‌ చేయిస్తే ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు కనిపించొచ్చని.. అయితే, దానివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారు కూడా ఇంట్లోనే కోలుకుంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు.

అలాగే స్వల్ప లక్షణాలు ఉన్నవారికి కూడా సీటీ స్కాన్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. సీటీ స్కాన్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయన్నారు. ఒక్క స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానమని తెలిపారు. దీని వల్ల రేడియేషన్‌కు గురై యువకులు వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని వెల్లడించారు. స్వల్ప, మోతాదు లక్షణాలు ఉండి, ఆక్సిజన్‌ స్థాయిలు మెరుగ్గా ఉంటే సీటీ స్కాన్‌ చేయించుకోవద్దని సూచించారు. లక్షణాలు కాస్త తీవ్రంగా ఉండి ఆసుపత్రిలో చేరినవారు వైద్యుల సూచన మేరకు మాత్రమే సీటీ స్కాన్‌ చేయించుకోవాలన్నారు. అయితే, తొలుత ఛాతి ఎక్స్‌రేకు వెళ్లాలని సూచించారు. తర్వాతే సీటీకి వెళ్లాలన్నారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా!

Drukpadam

కరోనా టెస్ట్​ చేస్తుంటే.. పుల్ల విరిగి ముక్కులో ఇరుక్కుంది: తెలంగాణలో ఘటన…

Drukpadam

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు ….

Drukpadam

Leave a Comment