Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సత్తుపల్లి ప్రజల నాడితెలిసిన నేత సండ్ర…!

సత్తుపల్లి ప్రజల నాడితెలిసిన నేత సండ్ర…!
-నాలుగోవసారి ఎన్నికకు వ్యూహాత్మక అడుగులు
-సీఎం కేసీఆర్ ఆహ్వానంమేరకు గులాబీ లో చేరిక
-మంత్రిపదవి పై నెరవేరని ఆశలు
-ఉద్దండులను సైతం ఎదిరించి నిలిచిన మొనగాడుగా గుర్తింపు
-నియోజకవర్గం అభివృద్ధిపైనే ద్రుష్టి
-విస్తృత పర్యటనల ద్వారా నిత్యం ప్రజల్లో

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించి ,ప్రజల నాడితెలిసిన నేతగా సండ్ర నాలుగోవసారి ఎన్నిక అయ్యేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . మూడుసార్లు సత్తుపల్లి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం నుంచి సండ్ర టీడీపీటికెట్ పైనే విజయం సాధించారు .తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . అయితే సీఎం కేసీఆర్ ఆయనకు ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు అయినప్పటికీ సీఎం సహాయసహకారాలతో వందల కోట్ల నిధులు తెచ్చి నియోజవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు . నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానేతగా మంచి పేరు తెచ్చుకున్నారు .ఎక్కడ ఏచిన్న సమస్య ఉందని తెలిసినా అక్కడ ఎమ్మెల్యే ప్రత్యక్షం అవుతుంటారు .ప్రజలకు నేనున్నాననీ భరోసా కల్పించడంలో ఆయన స్టైయిలే వేరు …చిన్న అధికారి నుంచి పెద్ద అధికారివరకు ఎవరు ఎక్కడ అవసరం ఉంటె వారిని కలిసి పనులు చేయిస్తుంటారు. ఎక్కడ కూడా అనసరమైన హామీలు ఇవ్వడం చేయరు .ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంతదూరమైనా వెళ్ళతారనే పేరు ఉంది. గత 14 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని జల్లెడ పట్టారు .అన్ని గ్రామాలతో అక్కడ ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు . నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ద్రుష్టి సారించిన ఎమ్మెల్యే సండ్ర, విద్య ,వైద్య ,రోడ్లు , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాంటి వాటిపై ప్రత్యేక కృషి చేశారు . నియోజకర్గంలో అభివృద్ధి పనులు జరిగిన ఇంకా చేయాలాల్సింది చాల ఉందని అంటారు సండ్ర …

అనివార్యంగా పార్టీ మార్పు …

సండ్ర వెంకటవీరయ్య టీడీపీ నుంచి గెలిచి గులాబీ పార్టీలో చేరడం కొంత ఇబ్బందిగా ఫీలు అయినా తప్పలేదు …తెలంగాణ లో టీడీపీ భవిష్యత్ అవకాశాలు లేకపోవడం , టీడీపీలో ఉంటె నియోజవర్గం అభివృద్ధి సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన సండ్ర సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరారు . అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర కు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది . ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు లేనందున ఆవర్గానికి చెందిన వెంకటవీరయ్య కు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు . కానీ అది జరగలేదు …చివరకు ఆయనకు ఖమ్మంలో తాను ఉంటున్న ఇంటిస్థలాన్ని రెగ్యూలరైజ్ చేశారని అందువల్లోనే గులాబీ పార్టీలో చేరారని ఆరోపణలు వెల్లు ఎత్తాయి…అవి అన్ని ఉత్తిదేనని తాను ఉంటున్న నివాసాన్ని కూడా ఖాళీ చేయాలనీ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే సండ్ర మొత్తుకున్నారు . వామపక్ష లనుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన సండ్ర మొదట సిపిఎం నుంచి పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు . ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాందించారు . సత్తుపల్లి నుంచి బీఆర్ యస్ అభ్యర్థిగా వెంకట వీరయ్య పోటీ ఖాయమైన నేపథ్యంలో విపక్షాల నుంచి తనకు ప్రత్యర్థి ఎవరు అనేది తేలాల్సి ఉంది ….

ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న సత్తుపల్లి ఆంధ్ర కల్చర్ ను పుణికి పుచ్చుకున్నది. గతంలో వేంసూరు నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లిగా మారింది….ఇక్కడ నుంచి హేమాహేమీలు రాష్ట్రశాసనసభకు ఎన్నికయ్యారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుది కూడా సత్తుపల్లి నియోజకవర్గమే. జలగం ప్రసాద్ రావు ,తుమ్మల నాగేశ్వరరావు , జలగం వెంకట్రావు లాంటి వారు ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు . ఈసారి తీర్పు ఎలా ఉంటుంది . సండ్ర ఎత్తులముందు ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉంటాయి సత్తుపల్లి లో ఎవరి జెండా ఎగురుతుంది అనేది ఆసక్తిగా మారింది ?

Related posts

ఈటల , విశ్వేశ్వరరెడ్డి కలయిక బంధుత్వమా ? రాజకీయమా ?

Drukpadam

పట్టు -బెట్టు

Drukpadam

రూట్ మార్చి సైకిల్ ఎక్కిన సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment