Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…
●అధికారుల కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం
●సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యాపారే సూత్రధారి
●మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు

(నాగేశ్వరరావు పోలంపల్లి, 8464981333 – 7555822277)

నిఘా నిద్రపోతుంటే.. దగా దండుకుంటుంది.. నిరుపేదల కడుపు నింపాల్చిన సర్కారు బియ్యం సందులలో తిరుగుతూ సరిహద్దులు దాటి అక్రమార్కుల జేబులు నింపుతుంది.. పక్క జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ఈ అక్రమ బియ్యం వ్యాపారాని సూత్రదారని తెలుస్తుంది. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్చిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాలతో పాటు ముదిగొండ మండలంలో అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా

సాగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం ఎక్కువ మంది తినడంలేదనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం అందించే బియ్యం వద్దు అనడం ఎందుకని ప్రతి నెలా రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తీచుకుంటున్నరు. దీంతో లబ్ధిదారుల వద్ద రేషన్ బియ్యం పేరుకు పోతున్నాయి. అదే అక్రమార్కులకు వరంగా మారింది. ఇంట్లో పేరుకు పోయిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు కొనుగోలుదారులకు కిలో రూ 8 చొప్పున అమ్ముతున్నారు.

బియ్యం కొంటాం.. రేషన్ బియ్యం..!
ఆయా మండలాల్లో తెల్లవారింది మొదలు బియ్యం ఉన్నాయా రేషన్ బియ్యం.. మేము కొంటాం అంటూ కొంతమంది బైక్ పై వచ్చి ప్రతి ఇల్లు తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు. ఉదయం సేకరించిన బియ్యాన్ని నమ్మకస్తులైన ఒక ఇంట్లో పెట్టి చీకటి పడిన తర్వాత ద్విచక్ర వాహనం, ఆటోల్లో వారి ప్రాంతానికి తరలిస్తున్నారు. అలా వివిధ గ్రామాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రహాస్య ప్రదేశంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని అదును చూసి లారీల ద్వారా కాకినాడ తరలిస్తున్నారు.

కోదాడ కు చెందిన ఓ వ్యాపారే సూత్రదారి
సూర్యాపేట జిల్లా, కోదాడ కు చెందిన ఓ అక్రమ బియ్యం వ్యాపారి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో సూత్రదారిగా వ్యవహారిస్తున్నట్లు సమాచారం. పాలేరు

నియోజకవర్గం కొదాడ పక్కనే ఉండడంతో ఇక్కడ రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు కొన్ని టీంలు ఏర్పాటు చేసి తమ దందా కొనసాగిస్తున్నట్లు వినికిడి.

దాడులు అంతంత మాత్రమే
పేదల బియ్యం అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన పౌరసరఫరాల శాఖ, పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఆశించిన స్థాయిలో తనిఖీలు చేయడం లేదు. దీంతో అక్రమ రవాణా సాగుతోంది. అరకొర తనిఖీలతో సరిపెటాటడమే కానీ, పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో పట్టుబడినా కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించించడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఆయా శాఖల అధికారులు దృష్టి సారించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది.

Related posts

పాకిస్థాన్ లో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..కట్టెల పొవ్వి వైపు ప్రజల దృష్టి!

Drukpadam

The Secrets of Beauty In Eating A Balanced Diet

Drukpadam

ల‌ఖింపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ ర‌ద్దు!

Drukpadam

Leave a Comment