Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ సదస్సుకు వచ్చిన అతిథులకు గిఫ్ట్ ప్యాక్ లు!

విశాఖ సదస్సుకు వచ్చిన అతిథులకు గిఫ్ట్ ప్యాక్ లు!

  • విశాఖలో జీఐఎస్-2023
  • ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు
  • 8 వేల గిఫ్ట్ ప్యాక్ లు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు గుర్తుండిపోయేలా విశిష్ట కానుకలతో కూడిన గిఫ్ట్ ప్యాక్ లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు వస్తువులను ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉంచారు. ఇలాంటివి 8 వేల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం జీఐఎస్-2023 వేదిక వద్ద పంపిణీ చేస్తోంది.

ఈ గిఫ్ట్ ప్యాక్ లో కలంకారీ డిజైన్ తో కూడిన పింగాణీ ప్లేట్, నోట్ బుక్, పెన్నులు, తదితర వస్తువులతో పాటు, తిరుపతి లడ్డూను, అరకు కాఫీ, టీ పొడులు, గిరిజన తేనె కూడా అందిస్తున్నారు.

కాగా, గిఫ్ట్ లు అందనివారు కొందరు డెలిగేట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రగడ సృష్టించారు. కొందరు అక్కడున్న తాత్కాలిక ఏర్పాట్లను చిందరవందర చేశారు.

Related posts

వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి…

Drukpadam

ఐటీ రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్రం!

Drukpadam

ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ, ఈ-పాస్ పోర్టులు.. కేంద్ర బడ్జెట్!

Drukpadam

Leave a Comment