Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పిండిప్రోలు సర్పంచ్ కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు కన్నుమూత!

పిండిప్రోలు సర్పంచ్ కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు కన్నుమూత!
-జీవితాంతం విప్లవ రాజకీయాలతో ప్రయాణం
-కుటుంబమంతా ఎర్రజెండా బాటలో
-పిండిప్రోలు అభివృద్ధిలో నాగేశ్వరరావు ముద్ర
-ప్రజల మనిషిగా గుర్తింపు …చిన్న పెద్ద తేడా లేకుండా ఆత్మీయ పలకరింపులు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంకు చెందిన పిండిప్రోలు గ్రామ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మంలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు .4 పర్యాయాలు సర్పంచ్ గా ఒక
సారి ఎంపీటీసీ గా పనిచేసిన నాగేశ్వరరావు గ్రామ అభివృద్ధిలో విశేష కృషిచేశారు . 74 సంవత్సరాల తన జీవితమంతా విప్లవ రాజకీయాల్లో ప్రయాణం చేశారు . తన కుటుంబమంతా చిన్నప్పటినుంచి ఎర్రజెండా నీడలోనే నడిచారు . నాగేశ్వరరావు సోదరుడు రాయల సుభాష్ చంద్రబోస్ సిపిఐ (ఎం ఎల్ )రాష్ట్ర కార్యదర్శి గా పనిచేసి మరణించారు. మరో సోదరుడు ఎం ఎల్ (ప్రజాపంథా ) లో కొనసాగుతున్నారు . చిన్నప్పటించు గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడిన నాగేశ్వరావు మృతితో పిండిప్రోలు శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సిపిఐ (ఎం ఎల్ ప్రజాపంథా ) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ , గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మంత్రి పువ్వాడ, ఎంపీలు వద్దిరాజు , నామ ఎమ్మెల్సీ తాతా మధు ఎమ్మెల్యేలు సండ్ర , కందాల తదితరుల సంతాపం

రాయల నాగేశ్వరరావు మృతివార్త తనకు దిగ్బ్రాంతి కలిగించిందని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు . నిబద్దత గల కమ్యూనిస్టుగా ప్రజలకోసం ఆయన చేసిన సేవలు కొనియాడారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎంపీ నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు నాగేశ్వరరావు మృతిపట్ల సంతాపం తెలిపారు .

పిండిప్రోలు లో అంత్యక్రియలు

గురువారం రోజున ఆయన అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాటు చేశారు . సిపిఎం ,సిపిఐ ఇతర పార్టీల నేతలు , పలువురు ప్రజాప్రతినిధులు మృతదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Related posts

కూతురు పెళ్లికి హాజరై.. తండ్రికి పదవిని బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్!

Drukpadam

జగన్ తిరుమల పర్యటన రద్దు!

Ram Narayana

రాముడు ఉత్తరాది దేవుడా? మన దేవుడు కాదా?: పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment