Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు:సీబీఐ మాజీ జేడీ

విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • లిక్కర్ స్కామ్ లో రేపు విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు
  • విచారణకు కవిత హాజరు అవుతారా అనే విషయంలో సస్పెన్స్
  • బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చన్న లక్ష్మీనారాయణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో రేపు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ఈ ఉదయం కవితకు ఈడీ నోటీసులు పంపింది. అయితే, తాను రేపు విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపినప్పటికీ… ఈడీ అధికారులు ఆమె విన్నపం పట్ల స్పందించలేదు.

దీంతో, ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. ఎల్లుండి ఆమె మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నారు. ఈ క్రమంలో ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో సందేహం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ…  మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ నోటీసులు జారీ అయ్యాయని… విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే, ముందస్తు బెయిల్ కోరుతూ సదరు వ్యక్తికి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని తెలిపారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ సర్కారు ఆదేశం..!

Drukpadam

హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలశ్యం ….

Drukpadam

ముగిసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు

Drukpadam

Leave a Comment