Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై కత్తులతో దాడి!

గోవా పర్యటనకు వెళ్లిన కుటుంబంపై కత్తులతో దాడి!

  • సోషల్ మీడియాలో వివరాలను వెల్లడించిన బాధిత కుటుంబం
  • ఘటనపై గోవా ముఖ్యమంత్రి సీరియస్
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు

గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీకి చెందిన ఓ కుటుంబానికి దారుణ అనుభవం ఎదురైంది. అంజునా ప్రాంతంలోని ‘స్పాజియో లీజర్‌’ రిసార్టులో ఉంటున్న వారిపై కొందరు కత్తులతో దాడి చేశారు. తమపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతకుమునుపు.. కొందరు హోటల్ సిబ్బందితో గొడవ జరిగిందని అతడు చెప్పుకొచ్చాడు. సిబ్బంది తీరుపై హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని తొలగించారని తెలిపాడు. ఆ తరువాత తమ కుటుంబం హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతుండగా కొందరు గేటు వద్ద గుమిగూడి ఉండటం కనిపించిందని చెప్పాడు. ఈ క్రమంలో జతిన్ కుటుంబ సభ్యులపై సుమారు నలుగురు కత్తులతో దాడి చేశారు.

దుండగులు ఆ కుటుంబంపై దాడి చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జతిన్‌పై దాడి జరుగుతున్న సమయంలో ఓ మహిళ తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఇక గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ ఈ దాడిని ఖండించారు. దీని వెనుక కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘‘దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించా’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Related posts

మెక్సికోలో దారుణం.. దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి

Ram Narayana

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

Drukpadam

ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. 

Drukpadam

Leave a Comment