బీఆర్ యస్ తో ఐక్యత …పోరాటం మా విధానం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని …
-ఎన్నికలు …పొత్తులు ఎత్తులు కాదు ప్రజా సమస్యల పరిస్కారమే మా ప్రధాన ఎజెండా
-ఎన్నికల్లో గౌరవప్రధానమైన సీట్లు కోసం కచ్చితంగా పట్టుబడతాం
-చట్ట సభల్లో వామపక్షాల ప్రాతినిధ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు
-చట్ట సభల్లో ప్రజా గొంతుకగా నిలుస్తాం …పేదల పక్షాన పోరాడతాం
-లీకులు కానివ్వండి , స్కాం లు కానివ్వండి బయటకు రావాలి
-సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి …
-అసలైన దోషాలు శిక్షంచబడాల్సిందే …
బీజేపీ వ్యతిరేక పోరాటంలో బీఆర్ యస్ కలిసి ముందుకు వెళ్లాలని కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి …అందువల్ల బీఆర్ యస్ తో ఐక్యతతో ముందుకు వెళుతూనే ప్రజాసమస్యల పరిస్కారం కోసం బీఆర్ యస్ ప్రభుత్వంపై కూడా పోరాడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు . శుక్రవారం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు … తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ బీజేపీ పై పోరాడటానికి ముందుకు వచ్చారు . అందుకు ఆయన వైఖరిని స్వాగతిస్తున్నాం …బీజేపీ వ్యతిరేక పోరాటంలో వామపక్షాలు కేసీఆర్ కు అండగా నిలుస్తాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలపై ప్రజల పక్షాన , పేదల , కార్మికుల , నిరుద్యోగుల , రైతుల , రైతు కూలీలు , మహిళలు , పక్షాన కేసీఆర్ ప్రభుత్వంపై మా పోరాటాలు ఆపేదిలేదని స్పష్టం చేశారు . ఐక్యత… పోరాటం తమ విధానమని వెల్లడించారు . ఇందులో ప్రభుత్వంతో ఎలాంటి రాజీ ఉండబోదని కుండబద్దలు కొట్టారు . రైతులకు గిట్టుబాటు ధరలు , ఎరువులు, పురుగు మందులు ధరల తగ్గింపు కోసం ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. ఇల్లు ,ఇళ్లస్థలాలు విషయంలో పేదలకు అండగా నిలిచామని వరంగల్ , హైద్రాబాద్ , మేడ్చల్ ,రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో వేలాది మంది తో గుడిశలు వేయించామని వాటిని 58 జి ఓ ప్రకారం రెగ్యూలరైజ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు . ఇటీవల కురిసిన వర్షాలకు తమ ప్రతిపాదనమేరకే ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు సీఎం ముందుకు వచ్చారని అన్నారు. అదే విధంగా కౌలు రైతులకు కూడా సహాయం అందించాలని కోరామని దానికి సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు .
మరి కొద్దీ నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పొత్తులు ,ఎత్తులపై సహజంగానే ప్రశ్నలు వస్తున్నాయని ,వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే కానీ ఎన్నికల కోసమే అనే విధంగా మా ప్రయాణం ఉండదన్నారు . రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని సీఎం ను కోరుతున్నామని అన్నారు . కమ్యూనిస్టులుగా మా ఆరాటం ,పోరాటం అంతా ప్రజల కోసమేనని అన్నారు . టీఎస్ పీఎస్ సి ప్రశ్న పత్రం లీకేజి అందరికన్నా ముందే తమ పార్టీ స్పందించిన విషయాన్నీ సాంబశివరావు గుర్తు చేశారు . తమ పార్టీ యువజన , విద్యార్ధి సంఘాల వారు పోలిసుల లాఠీ దెబ్బలు తిన్నారని కేసులు కూడా పెట్టారని తెలిపారు .
సిపిఐ ,సిపిఎం ఐక్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయం
సిపిఐ ,సిపిఎం పార్టీలు ఐక్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని సాంబశివరావు అన్నారు. ఇంతకూ ముందులాగా పరస్పరం పోటీ పడటం జరగదని అన్నారు .ఎన్ని సీట్లు అడుగుతున్నారు . ఎవరెవరు ఎన్నిసీట్లలో పోటీ చేస్తారనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు తప్పకుండ చెపుతామన్నారు .
రాష్ట్రంలో 40 నుంచి 50 సీట్లపై కమ్యూనిస్టుల ప్రభావం ...
ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఎవరితో పొత్తు ఉంటుంది …ఎన్ని సీట్లు కోరుతున్నారు ఎక్కడ ,ఎక్కడ పోటీచేస్తున్నారని తరుచు అడుగుతున్నారని రాష్ట్రంలో 40 నుంచి 50 సీట్లలో కమ్యూనిస్టుల ప్రభావం ఉంటుందని అన్నారు . అందువల్ల వాపపక్షాలకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని కచ్చితంగా కోరుతున్నామని స్పష్టం చేశారు . ఒకవేళ గౌరప్రదమైన సీట్లు ఇవ్వకపోతే అనే సమస్య వస్తే అనే ఒక విలేకరి ప్రశ్నించగా అలాంటిది రాకుండా ఉంటుందనే ఆశిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు . కొందరు బీఆర్ యస్ ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని అంటున్నారని ప్రస్తావించగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఇటీవల ఆలా అన్నట్లు తెలిసింది . ఆయన ఎవరి ఓట్లతో గెలిచాడో చెప్పాలని అన్నారు …మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటంలేదని అన్నారు . …అదే విధంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎవరి ఓట్లతో గెలిచారు . కొత్తగూడెంలో ఏమిటి ? కమ్యూనిస్టులు లేకపోతె వీరు జిల్లాలో గెలిచేవారేనా…? అంటూ సాంబశివరావు ప్రశ్నించారు .
చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు …
చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉందడాలి ప్రజలు కోరుకుంటున్నారు ..కమ్యూనిస్టులు ఉంటె తమ సమస్యలు సభ దృష్టికి తెచ్చి పరిష్కరిష్కరిస్తారని కార్మికులు, కర్షలులు యువకులు , ఉద్యోగులు, మహిళలు నమ్మకంతో ఉన్నారు . కమ్యూనిస్టులు లేకపోవడంతో తమ సమస్యలు సభలో ప్రస్తావించేవారు లేరనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు . బలహీనుల , పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలని వారు కోరుకోవడం శుభసూచకమన్నారు . అందువల్ల వారి నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా గౌరప్రదమైన సీట్లకోసం పట్టుబడతామని ,ఇందులో ప్రజల అభిప్రాయాల ప్రకారమే నడుచుకుంటామని అన్నారు . కచ్చితంగా ప్రజల పక్షాన వారి గొంతుకగా చట్టసభల్లో వారి వాణి వినిపిస్తామని అన్నారు .
స్కాం లు …లీకులపై విచారణ జరిపించి నిజమైన దోషులను శిక్షించాలని తమ పార్టీ కోరుతుందని సాంబశివరావు అన్నారు .ఇందుకోసమే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . అసలైన దోషులు ఎవరైనా శిక్షపడాల్సిందేనని అన్నారు . మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు ,సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , జిల్లా నాయకులూ జమ్ముల జితేందర్ రెడ్డి , జానీమియా తదితరులు పాల్గొన్నారు.