వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త కోణం, సీబీఐ కార్యాలయానికి సునీత భర్త!
- సీబీఐ ఎదుట వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలం
- సునీత భర్త, ఆయన సోదరుడు బెదిరించినట్లు ఆరోపించిన షమీమ్
- భాస్కర్ రెడ్డి, ఉదయ్ ల విచారణ అనంతరం సీబీఐ ఆఫీస్ కు రాజశేఖర రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. వివేకా కూతురు సునీత భర్త రాజశేఖర రెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ ల విచారణ ముగిసిన అనంతరం సీబీఐ అధికారుల వద్దకు భాస్కర్ రెడ్డి వెళ్లారు. వివేకా రెండో భార్యగా చెబుతున్న షమీమ్ సీబీఐ అధికారుల ఎదుట తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందులో సునీత భర్త, సోదరుడి పైన ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
రాజశేఖర రెడ్డి, ఆయన సోదరుడు తనను చాలాసార్లు బెదిరించినట్లు షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి సీబీఐ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇదిలా ఉండగా, భాస్కర్ రెడ్డి, ఉదయ్ లను విచారించిన అనంతరం వారిని జైలుకు తరలించారు. రేపు కూడా మరోసారి వారిని విచారించనున్నారు.