Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రంలో కమలమే…ఏపీలో ఫ్యాన్ గాలి టైమ్స్ నౌ సర్వే …!

దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా కమల వికాసమే…. టైమ్స్ నౌ సర్వే వెల్లడి

  • మరోసారి బీజేపీనే గెలుస్తుందన్న తాజా సర్వే 
  • సర్వే చేపట్టిన టైమ్స్ నౌ గ్రూప్ సంస్థ నవభారత్ టైమ్స్
  • ఎన్డీయే కూటమికి 292 నుంచి 338 స్థానాలు వస్తాయని వెల్లడి
  • కాంగ్రెస్ కు 106 నుంచి 144 స్థానాలు
  • వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ స్థానాలు
  • టీఎంసీకి 20 నుంచి 22 స్థానాలు
  • ఇతర రాజకీయ పార్టీలకు 50 నుంచి 80 స్థానాల్లో విజయం

జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ గ్రూప్ కు చెందిన నవభారత్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుందని ఆ సర్వే చెబుతోంది.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 292 నుంచి 338 స్థానాలు వస్తాయని తెలిపింది. అదే సమయంలో, కాంగ్రెస్, మిత్రపక్షాలకు 106 నుంచి 144 స్థానాలు మాత్రమే లభిస్తాయని నవభారత్ టైమ్స్ వివరించింది.

ఇక వైసీపీ 24 నుంచి 25 ఎంపీ స్థానాలు…. తృణమూల్ కాంగ్రెస్ 20 నుంచి 22 స్థానాలు… బీజేడీ (ఒడిశా)కి 11 నుంచి 13 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఇతర రాజకీయ పక్షాలు 50 నుంచి 80 సీట్లు గెలుచుకుంటాయని సర్వే చెబుతోంది.

భారత్ జోడో యాత్ర ప్రభావం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి లాభించి, వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగడానికి అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

Related posts

ఢిల్లీ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు అవుట్!

Drukpadam

షర్మిల 25 వేల సహాయం…ఒక్క పాలేరులోనేనా ?రాష్ట్రమంతనా ??

Drukpadam

2024 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుంది: ప్రశాంత్ కిశోర్

Drukpadam

Leave a Comment