Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

కర్ణాటకలో హైడ్రామా …సీఎం సీటుకోసం సిద్దరామయ్య …డీకే శివకుమార్ పట్టు…

కర్ణాటకలో హైడ్రామా …సీఎం సీటుకోసం సిద్దరామయ్య …డీకే శివకుమార్ పట్టు…
-ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న దూతలు
-ఇద్దరినీ కన్విన్స్ చేసేందుకు అధిష్టానం దూతలు మల్ల గుల్లాలు
-ఒక ప్రవేట్ హోటల్ లో జరగాల్సిన సమావేశం ఆలస్యంగా ప్రారంభం
-తమనాయకుడికి అంటే తమనాయకుడికే సీఎం పదవి ఇవ్వాలని మద్దతుదారుల ఆందోళనలు
-ప్లెక్సీల ప్రదర్శన …సుశీల్ కుమార్ షిండే నాయకత్వంలో బెంగుళూర్ చేరుకున్న టీం …

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాగ్రెస్ సంబరాలు జరుపుకుంది. దేశవ్యాపితంగా కాంగ్రెస్ లో కర్ణాటక ఎన్నికలు మంచి జోష్ నింపాయి. ఇంతవరకు బాగానే ఉన్నా సీఎం అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు …సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్దరామయ్య , కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ పోటీపడుతున్నారు . ఇద్దరు ..ఇద్దరే అయితే ఎవరిని సీఎం చేయాలనేది అధిష్టానానికి కూడా పెను సవాల్ గా మారింది. ఒక పక్క అనుభవం ఉన్న సిద్దరామయ్య కాగా ,మరో పక్క కమిట్ మెంట్ ఉన్న నాయకుడుగా డీకే ఉన్నారు . అంటే కాకుండా గాంధీ ఫామిలీ కి వీర విధేయుడు కూడా … బెంగుళూర్ లోని షాంగ్రిల్లా హోటల్ లో సమావేశం అవుతున్నారు .ఒక సందర్భంలో ఈరోజే సీఎల్పీ నేతను ఎన్నుకున్నారని అనుకుంటున్నావాయిదా కూడా పడుతుందా అనే మరో అవకాశం ఉంది.

సీఎల్పీ నేత ఎన్నిక సందర్భంగా బెంగుళూరు లో ఉండాల్సిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన ఢిల్లీలో వెళ్లారు .అక్కడ సోనియా , రాహుల్ గాంధీ తో సమావేశం అయినట్లు సమాచారం …ఈడ్రామా మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందా లేక ఈరోజు రాత్రికి నిర్ణయం జరుగుతుందా అనే ఉత్కంఠత కొనసాగుతుంది. అధిష్టానం దూతలు ఇక్కడ నుంచి నిత్యం ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు . ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకొని మంచి మెజార్టీ తో గెలిపిస్తే సీఎం పదవి కోసం నేతలు పంటలకు పట్టింపులకు పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ….

Related posts

ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ అలక… కెప్టెన్సీకి గుడ్ బై!

Drukpadam

దేహదారుఢ్యం కోసమే రాహుల్ పాదయాత్ర: కేటీఆర్

Drukpadam

ఎన్నికల ముందు బీజేపీ శ్రీరామ జపం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని ధ్వజం …

Ram Narayana

Leave a Comment