Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంగరంగ వైభవంగా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం.. రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించిన మోదీ

  • మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
  • నూతన పార్లమెంటు భవనం వద్ద శృంగేరీ పీఠాధిపతుల స్వాగతం
  • స్పీకర్, మంత్రులతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న మోదీ
  • రాజదండానికి సాష్టాంగ ప్రమాణం
  • పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసిన మోదీ

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. తొలుత లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో కలిసి పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అనంతరం నూతన పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి శృంగేరీ పీఠాధిపతులు కలశంతో స్వాగతం పలికారు. 

అప్పటికే రాజదండానికి (సెంగోల్)కు పూజలు నిర్వహించగా మోదీ దానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అధీనం మఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్‌సభలోని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్ఠించిన మోదీ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మఠాధిపతుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనల్లో స్పీకర్ ఓం బిర్లా, కేబినెట్ మంత్రులతో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను మోదీ సన్మానించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి కొత్త పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు.

Related posts

వీలునామా రాయకపోతే తండ్రి ఆస్తుల్లో కుమార్తెలకు వాటా: సుప్రీంకోర్టు!

Drukpadam

జర్నలిస్టుల ఇళ్లస్థలాలు …హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలి …టీయూడబ్ల్యూ జె ( ఐజేయూ ) డిమాండ్ …

Drukpadam

దేశంలో మొదలైన పెళ్లిళ్ల సీజన్..32 లక్షల వివాహాలు లక్షల కోట్ల వ్యాపారం!

Drukpadam

Leave a Comment