Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !
మంత్రి పువ్వాడకు ఖమ్మంతో పాటు ఇల్లందు భాద్యతలు
లోకసభ పక్షనేత నామకు మధిర , రాజ్యసభ సభ్యులు వద్దిరాజుకు కొత్తగూడెం
వైరా కు ఎమ్మెల్సీ , జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు
సత్తుపల్లి , అశ్వారావుపేటకు ఎంపీ పార్థసారధిరెడ్డి , ఎమ్మెల్యే సండ్ర
పినపాక కు ఎమ్మెల్యే రేగా , భద్రాచలానికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని
పాలేరు కు కందాలనేనా …?

ఎన్నికలు నెత్తిమీదకు వస్తున్నాయి. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు . నవంబర్ ,డిసెంబర్ లలో ఎన్నికలు జరగనున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడ నున్నది . దీంతో తెలంగాణాలో అన్నిరాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి .. అధికార బీఆర్ యస్ పార్టీ ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎప్పుడు లేనిది సీఎం కేసీఆర్ రోజు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు .

దశాబ్ది ఉత్సవాల పేరుతో సీఎం కేసీఆర్ పార్టీ నేతలను , ఎమ్మెల్యేలు ,ఎంపీలు , ఎమ్మెల్సీలు మంత్రులు అందరు ప్రజల వద్దకు వెళ్లేలా 21 రోజులపాటు కార్యక్రమాన్ని డిజైన్ చేశారు . దీంతో 43 ,44 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం అధికారులు ,ప్రజాప్రతినిధులు చమటలు కక్కుతూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . వరస కార్యక్రమాలు బాధ్యతలతో ఉండాలే ఉద్దేశంతో పార్టీ నేతలకు , ప్రధానంగా ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఎమ్మెల్సీలను ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు . అందులో భాగంగానే ఎన్నికలకు ఇంచార్జిలను కూడా నియమించారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మంత్రిని ఇంచార్జిలుగా నియమించినట్లు అత్యత విశ్వసనీయ సమాచారం…ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటె తప్ప వారే ఇంచార్జిలుగా ఉండే అవకాశం ఉంది….అయితే వీరికి సలహాలు సూచనలు ఇవ్వడంతోపాటు జిల్లాలో వాస్తవపరిస్థితులను అంచనా వేసేందుకు కేసీఆర్ సొంత టీంలు కూడా జిల్లాల్లో పర్యటలు చేస్తాయి .

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు బీఆర్ యస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించింది. జిల్లాలోని హేమాహేమీలు ఇందులో ఉన్నారు . వారిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపీలు నామ నాగేశ్వరావు , వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారధి రెడ్డి ఉన్నారు . వీరే కాకుండా ఖమ్మం , కొత్తగూడెం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ ఉన్నారు . ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లోని గెలుపు బరువు భాద్యతలను వారిపై పెట్టారు . గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పొరపాట్లు జరగ కుండా వారికీ పార్టీ దిశ నిర్దేశం చేయనున్నది .

విచిత్రమేమిటంటే శాసనసభ్యులుగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావులకు వారి వారి నియోజకవర్గాల భాద్యతలను వారికే అప్పగించడం గమనార్హం … పాలేరు నియోజకవర్గానికి కూడా ప్రస్తుతానికి కందాలనే ఇంఛార్జిగా ఉన్నారు …అయితే పార్టీలో ముఖ్యనేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , జలగం వెంకట్రావులకు ఎక్కడ భాద్యతలు అప్పగించలేదు … వీరికి పార్టీ టికెట్స్ ఇస్తుందా లేదా …? అనేది ఇంకా స్పష్టం కాలేదు … పాలేరు పై తుమ్మల , కొత్తగూడెం పై జలగం పట్టుదలతో ఉన్నారు . జిల్లాలో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే ఇద్దరు సీనియర్ నేతలను కూడా సంతృప్తి పరచాల్సి ఉంటుంది. లేకపోతె మొదటికే మోసం వచ్చే అవకాశం కొని తెచ్చుకున్నట్లే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

ఈటలకు కేసీఆర్ గాలం వేస్తున్నారా ?

Drukpadam

రేవంత్ తో డిబేట్ కు రావాలన్న నెటిజన్… క్రిమినల్స్ తో చర్చకు రానన్న కేటీఆర్!

Drukpadam

ప్రపంచంలోనే ఈ గ్రామంలో ముస్లింలు ఎంతో ప్రత్యేకం… 

Drukpadam

Leave a Comment