Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ …

పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ …
అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పలువురు పరామర్శ
కేతపల్లి పాదయాత్ర శిబిరంలో చికిత్స అందించిన వైద్యులు
వడదెబ్బ కారణంగా జ్వరంతో బాధపడుతున్న భట్టి విక్రమార్క
హుటాహుటిన ఖమ్మం నుండిబయలుదేరినటువంటి కాంగ్రెస్ శ్రేణులు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మొహమ్మద్ జావిద్ రాయల నాగేశ్వరరావు , పో ట్ల నాగేశ్వరరావు

గత 96 రోజులుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సూర్యాపేట జిల్లాలోని కేతేపల్లి లో వడదెబ్బకు గురైయ్యారు . దీంతో వైద్యుల పరీక్షల అనంతరం విఫరీతమైన ఎండలు వడగాడ్పులవల్ల వడదెబ్బ తగిలిందని వైద్యులు నిర్దారించారు . విశ్రాంతి అవసరమని సూర్యాపేట నుంచి వచ్చిన డాక్టర్ల బృందం చెప్పడంతో మంగళవారం సాయంత్రం ఆయన యాత్ర చేయలేదు …. మూడు నెలల తన పాదయాత్రలో ముప్పై నియోజకవర్గాల్లో పర్యటించారు . ఏఐసీసీ నాయకత్వం సైతం ఆయన పట్టుదలను కొనియాడింది. అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ లో మాట్లాడారు . అంతకు ముందు మంచిర్యాల లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే …హైద్రాబాద్ సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు . భట్టి యాత్ర కాంగ్రెస్ శ్రేణులను ఐక్యం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడిందని అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగటం ,కాంగ్రెస్ నాయకత్వం సైతం తెలంగాణ పై ఫోకస్ పెట్టడంతో సానుకూల పరిణామాలుగా మారాయి. ఎన్ని అడ్డంకులు వచ్చిన ,అవాంతరాలు వచ్చిన భట్టి తనపేరుకు తగ్గట్లు పట్టువదలని విక్రమార్కుడిలా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అణగారిన వర్గాల్లో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పడం , వారి బాగోగులు తెలుసుకోవడం ప్రజల్లో కలిసి పోతున్న తీరు భట్టి నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తుంది.

మంగళవారం సాయంత్రం కేతేపల్లి నుంచి యాత్ర కొనసాగాల్సి ఉండగా వడదెబ్బకు అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులు వచ్చి నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందించారు . వడదెబ్బ కారణంగా హైఫీవర్ రావడంతో ఈరోజు సాయంత్రం జరుగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి 96 రోజులు కా వస్తున్నది. గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు ఉన్నాయని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే. కాగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్న సంకల్పంతో భగ భగ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పాదయాత్ర చేయడం వల్ల సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బకు గురయ్యారు.

 

Bhatti gets sunburned in People’s March…break for yatra on Tuesday evening…
CLP leader Bhatti Vikramarka, who fell ill, was visited by many
Doctors treated at Ketapalli Padayatra camp
Bhatti Vikramarka suffering from fever due to sunburn
The Congress ranks that came out of Khammam were district city Congress presidents Durga Prasad Mohammad Javid Rayala Nageswara Rao, Po Tla Nageswara Rao.

CLP leader Bhatti Vikramarka, who has been conducting the People’s March Padayatra for the last 96 days, got sunburned at Ketepalli in Suryapet district on Tuesday. After the doctor’s examination, the doctors confirmed that the sunstroke was caused by the sun. He did not do the trip on Tuesday evening as a team of doctors from Suryapet said that he needed rest…. He visited thirty constituencies in his three-month padayatra. AICC leadership also praised his perseverance. Rahul Gandhi who is in America spoke in Zoom meeting. Before that, AICC president Mallikarjuna Kharge in Manchyryala…Priyanka Gandhi participated in the Hyderabad assembly. Opinions are being expressed that the Bhatti Yatra was very useful in uniting the ranks of the Congress. After the Karnataka elections, the Congress graph in Telangana increased suddenly and the Congress leadership also focused on Telangana, which became a positive development. No matter how many obstacles and troubles Bhatti has faced, he continues his journey like a pilgrim who does not insist that his name falls short. The way that Indiramma will bring the kingdom to the downtrodden communities and know their well-being is a testament to Bhatti’s leadership skills.

While the yatra was to continue from Ketepalli on Tuesday evening, he fell ill due to sunburn. Emergency doctors came from Suryapet and provided medical treatment at Ketapalli Padayatra camp of Nakirekal Constituency. People’s March march scheduled for today evening has been called off due to high fever due to sunstroke. It has been 96 days since CLP leader Bhatti took Vikramarka Padayatra. It is a matter of course that since the last three to four days there has been severe hailstorm in the state and doctors have issued warnings not to come out unless necessary. Meanwhile, CLP leader Bhatti Vikramarka suffered from sunburn due to his determination to bring Indiramma Rajya in Telangana despite the scorching sun in 45 degree temperature.

Related posts

తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణం ఇదే!

Ram Narayana

ఓఎంసీ కేసులో డిశ్చార్జీ పిటిషన్లు …రేపటికి వాయిదా ..!

Drukpadam

హర్యానా సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట.. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే!

Drukpadam

Leave a Comment