Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటెల హత్యకు కుట్ర …నాభర్తకు ఏమైనా జరిగితే కేసీఆరే భాద్యత వహించాలి …జమున

ఈటెల హత్యకు కుట్ర …నాభర్తకు ఏమైనా జరిగితే కేసీఆరే భాద్యత వహించాలి …జమున
కేసీఆర్ అండ చూసుకుని కౌశిక్ రెడ్డి బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు
నయీమ్ బెదిరింపులకు భయపడలేదు …
తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడినం
బీజేపీ నుంచి నేను వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లు పార్టీలోనే ఉన్నారు: ఈటల
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారే వ్యక్తిని కాదన్న ఈటల
కొందరు చిల్లరగాళ్లు కోరుకున్నట్లుగా తాను ఈజీగా నిర్ణయం తీసుకోనని వ్యాఖ్య
తనను కించపరిచేవారు కొంతమంది పార్టీలో ఉన్నారని ఆరోపణ
బీఆర్ఎస్ బయటికి పంపిస్తే.. బీజేపీ అక్కున చేర్చుకుందని వెల్లడి

తన భర్త భర్త హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను   హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆయన కు ఏమైనా జరిగితే కేసీఆరే భాద్యత వహించాల్సి ఉంటుందని ఈటెల సతీమణి జమున హెచ్చరించారు . తెలంగాణ రాష్ట్రం కోసం తెగించికొట్లాడినవాళ్ళం , నయీమ్ లాంటి గ్యాంగ్ బెదిరింపులకు భయపడలేదు అని ఆమె ఉద్యేగభరితంగా మాట్లాడారు . మంగళవారం భర్త బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడాడు …ఈసందర్భంగా కేసీఆర్ చర్యలను తప్పుపట్టారు . ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హత్యకు కుట్ర చేస్తున్నారని తెలిసిందని అందుకు 20 ఇస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నా విషయాన్నీ ఆమె ప్రస్తావించారు .

ఈసందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తాను బీజేపీ నుంచి వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లు కొంతమంది పార్టీలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది వాళ్ల ఖర్మ అని, దానికి తానేం చేయలేనని చెప్పారు. ‘‘నేను వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లెవరో అందరికీ తెలుసు. నన్ను కించపరిచేవారు కొంతమంది పార్టీలో ఉన్నారు. వాళ్ల గురించి నేను పట్టించుకోను” అని ఈటల స్పష్టం చేశారు.

బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. కొందరు చిల్లరగాళ్లు కోరుకున్నట్లుగా తాను ఈజీగా నిర్ణయం తీసుకోనని చెప్పారు. తాను ఎప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతానా అని తమ పార్టీలోనే కొందరు ఎదురుచూస్తున్నారన్నారు.

కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ..కాలుకు బలపం కట్టుకుని ఊరూరా తిరుగుతా…ఈటెల

బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపిస్తే.. బీజేపీ అక్కున చేర్చుకుందని అన్నారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌కు అహంకారం పెరిగింది. చిన్న రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదు కానీ ఇంకేదో చేస్తారట. కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు” అని చెప్పారు. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం అసలు లేదని చెప్పారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని అన్నారు.

Related posts

హరీష్ రావు కు ప్రభుత్వం లో పెరుగుతున్న భాద్యతలు …ప్రజల్లో తగ్గుతున్నక్రేజ్!

Drukpadam

కర్ణాటక సీఎల్పీ సమావేశం… సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు …

Drukpadam

ఇద్దరు పెద్దోళ్ల కూతుళ్ళ మధ్య ట్విట్టర్ యుద్ధం …!

Drukpadam

Leave a Comment