Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ఖర్గే ,రాహుల్ హాజరు..! …

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ: ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు
వ్యూహ కమిటీ భేటీలో ఖర్గే, రాహుల్ తో పాటు ఠాక్రే
తెలంగాణ నాయకులకు, సీనియర్లకు దిశా నిర్దేశనం
పదిహేనుమందికి మాత్రమే పిలుపు

ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత, మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేలు పాల్గొన్నారు. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరయ్యారు. వ్యూహ కమిటీ సభ్యులు.. తెలంగాణ నాయకులకు, పార్టీ సీనియర్ నేతలకు దిశానిర్దేశనం చేశారు . సమావేశం రెండున్నర గంటలపాటు జరిగింది. అనేక కీలక అంశములపై చర్చలు జరిగినట్లు సమాచారం …పార్టీలో నేతల మధ్య ఐక్యత , బీఆర్ యస్ వైఫల్యాలపై విస్త్రత ప్రచారం , బీసీ , ఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతపై కూడా చర్చినట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశానికి పదిహేను మందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తమను ఆహ్వానించకపోవడంపై పలువురు నేతలు ఆసంతృప్తితో ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పవద్దని అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీలు ఉత్తమకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి , శ్రీధర్ బాబు , సీతక్క , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , వి .హనుమంతరావు , మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి , మధు యాష్కీ , షబ్బీర్ అలీ , సంపత్ కుమార్ , తదితరులు సమావేశంలో పాల్గొన్నారు .

 

Related posts

విశాఖ ఉక్కు ప్రవేటీకరణ పై భగ్గుమంటున్న తెలుగు ప్రజలు…

Drukpadam

మీడియా సంస్థల అధిపతుల ఫోన్లూ వదలని ప్రణీత్‌రావ్ అండ్ కో!

Ram Narayana

వైరా మున్సిపల్ సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ సోమ్ము చెల్లించాలని…సిపిఐ

Drukpadam

Leave a Comment