Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన పరకాల ప్రభాకర్…

మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన పరకాల ప్రభాకర్…

  • దేశం అత్యంత సంక్షోభంలో ఉందన్న పరకాల
  • ఆత్మహత్య చేసుకున్న వాళ్లు, చనిపోయిన వలస కార్మికుల లెక్కలు ఉన్నాయా? అని నిలదీత
  • దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా భావజాలం పెరుగుతోందని వ్యాఖ్య

ప్రస్తుతం దేశం అత్యంత సంక్షోభంలో ఉందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిరుద్యోగం, ధరల పెరుగుదల ఇప్పుడే అధికంగా ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంక్షోభంలో మన గణతంత్రం – విశ్లేషణ అనే అంశంపై ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా సంస్థ నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. దేశంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఎంతమంది? వలస కార్మికులు ఎంతమంది చనిపోయారు? అనే వివరాలు ప్రధాని మోదీ వద్ద ఉన్నాయా? అని ప్రశ్నించారు.

మన దేశంలో 25 శాతం జనాభా పౌష్టికాహారం లేక బలహీనమైపోతున్నారని, భారత్ లో చైనా చొరబడినా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, నిరుద్యోగం పెరిగినా… పట్టించుకోవడం లేదని, మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామని మండిపడ్డారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా భావజాలం పెరుగుతోందన్నారు. భారత్ ను ఇంకో పాకిస్థాన్ చేయాలనుకుంటే గాంధీ, నెహ్రూ, పటేల్ లకు రెండు నిమిషాలు పట్టేది కాదన్నారు.

Related posts

అక్కాచెల్లెమ్మలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది : జగన్

Drukpadam

అమెరికా అధ్యక్షుడు బైడెన్-కమలా హారిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా?

Drukpadam

దటీస్ కేసీఆర్ దేశమంతా ఇదే ఫార్ములా …అభ్యర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 ల‌క్ష‌ల చెక్కు!

Drukpadam

Leave a Comment