Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

మహారాష్ట్రలో నిట్టనిలువునా చీలిన ఎన్సీపీ … బీజేపీ వ్యూహం సక్సెస్..!

బాబాయ్‌కి షాక్.. శరద్‌పవార్‌‌పై అజిత్ పవార్ తిరుగుబాటు.. ఎన్సీపీలో చీలిక!

-మహారాష్ట్రలో నిట్టనిలువునా చీలిన ఎన్సీపీ … బీజేపీ వ్యూహం సక్సెస్
-అజిత్ పవార్ ఆధ్వరంలో చీలికవర్గం నుంచి 29 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ..
-అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి
-ఆయన వర్గీయులకు మంత్రివర్గంలో చోటు
-అజిత్ పవార్ వెన్నుపోటుపై ఖంగు తిన్న మరాఠా యోధుడు శరద్ పవార్

ఆదివారం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి . శరద్ పవార్ అన్నకొడుకు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ షాక్ ఇచ్చారు .పార్టీని నిట్టనిలువునా చీల్చి తన వర్గం నాయకులతో అధికార బీజేపీ శివసేన పార్టీల నేతన్నలు కల్సి వారి మంత్రివర్గంలో చేరేందుకు సమ్మతి తెలిపారు . అందుకు వారు కూడా అంగీకరించారు . వెంటనే రాజ్ భవన్ లో గవర్నర్ చేత ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు . ఈ హఠాత్ పరిణామాలతో శరద్ పవార్ షాక్ తిన్నారు. అజిత్ పవార్ లో అసమ్మతి ఉన్నదని తెలిసిన ఆయనతో ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్లడం పెద్దాయనకు రుచించడంలేదు . పార్టీలనూ చీల్చి తమకు అణులంగా మార్చుకోవడంలో దిట్టగా ఉన్న బీజేపీ మరోసారి తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు ఎన్సీపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అజిత్ భవించారు . అయితే అందుకు విరుద్ధంగా శరద్ పవార్ తన కుమార్తె ఎంపీ సుప్రియసులేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు . దీంతో ఆయన అసమ్మతితో ఉన్నారు . నేడు ఆయన బీజేపీ ఆకర్ష్ లో పడిపోయారు …

 

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. శరద్‌పవార్ నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. శరద్‌పవార్‌‌పై తన అన్న కొడుకు అజిత్‌పవార్ తిరుగుబాటు చేశారు. పార్టీలోని 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.
మొత్తం 30 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌‌ను ఈ రోజు కలిశారు. వీరంతా సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్‌‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
మహారాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల అజిత్ పవార్ చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఆదివారం ఆయన తన అధికార నివాసం దేవగిరిలో ఆయన సమావేశమయ్యారు. తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Related posts

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్.. దిమ్మతిరిగే ప్రకటన చేసిన ఎన్సీపీ!

Drukpadam

“కాంగ్రెస్’ను ట్విట్టర్ బయో నుంచి తీసేసిన హార్దిక్ పటేల్

Drukpadam

ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి ఈటలపై గంగుల ఫైర్!

Drukpadam

Leave a Comment