Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ ది పెద్ద అవినీతి ప్రభుత్వం..వరంగల్ సభలో ప్రధాని మోడీ …

బీఆర్ఎస్ప్రభుత్వంచేసిందినాలుగేపనులు..: ప్రధానిమోదీసెటైర్ లు

  • తనను తిట్టడమే బీఆర్‌‌ఎస్ పనిగా పెట్టుకుందన్న మోదీ
  • అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికేనని విమర్శ
  • తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపాటు
  • అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటీ లేదని ఆరోపణ

బీఆర్ఎస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులే చేసిందని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటిది.. ఉదయం లేచింది మొదలు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. మిగతా ఏ పనులు చేయటం లేదు” అంటూ చురకలంటించారు.

‘‘ఇక రెండోది.. కుటుంబ పార్టీని పోషించడం. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయి. మూడోది.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు” అని మండిపడ్డారు.

‘‘ఇక నాలుగోది.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతోంది. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు” అని తీవ్ర విమర్శలు చేశారు. తన 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఈ నాలుగు పనులే అని ఆరోపించారు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ అవినీతిని దేశం మొత్తం చూసింది.. బీఆర్ఎస్ అవినీతిని తెలంగాణ మొత్తం చూసింది. బీఆర్‌‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా తెలంగాణకు హానికరమే. ఈ రెండు పార్టీల నుంచి జాగ్రత్తగా ఉండాలి” అని ప్రజలను హెచ్చరించారు.

దేశంలో, తెలంగాణలో కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. బీజేపీ అలాంటి ప్రమాణాలు చేయదని, రేషన్ ఇస్తామని చెప్తే ప్రతి ఇంటికీ రేషన్ బియ్యం వచ్చి చేరుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ ఇస్తామని చెప్తే దేశంలోని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

వరంగల్ మాకు అప్పటి నుంచే కంచుకోట…మోదీ..

  • పౌరుషానికి వరంగల్ నగరం ప్రతీక అన్న ప్రధాని
  • జన్ సంఘ్ సమయం నుంచే వరంగల్ తమకు కంచుకోట అని వ్యాఖ్య
  • నాడు బీజేపీకి 2 ఎంపీ సీట్లే వచ్చాయని వెల్లడి
  • అందులో హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి ఒక్కరన్న మోదీ
Prime Minister Narendra Modis interesting comments on Warangal

ఓ బీజేపీ కార్యకర్తగా ప్రజల మధ్యకు వచ్చానని ప్రధాని మోదీ అన్నారు. పౌరుషానికి వరంగల్ నగరం ప్రతీక అని చెప్పారు. వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.

జన్ సంఘ్ సమయం నుంచే వరంగల్ తమకు కంచుకోట అని ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు.. అందులో హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి ఒక్కరని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ట్రైలరే చూపించిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని, మేడిన్ ఇండియాకు తెలంగాణ ఎంతో సాకారం అందించిందని అన్నారు. 

‘‘కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఈ రోజు మాకు ఓ విషయం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మా గెలుపు ఖాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Drukpadam

పాదయాత్రలో రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..

Drukpadam

రాష్ట్రం అగ్నిగుండం ….పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు 15 మంది మృతి…

Drukpadam

Leave a Comment