Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

రేవంత్ ఆలా …కేటీఆర్ ఇలా …రేవంత్ ఉచిత విద్యత్ మాటలపై రాజకీయ దుమారం…

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకే ఉచిత విద్యుత్ రాద్ధాంతం: రేవంత్

  • రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న రేవంత్
  • బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని మరోసారి తేలిందని విమర్శ
  • అన్ని మండలాల సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపు

తెలంగాణలో రాజకీయాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవడంతో రాజకీయ నాయకులమధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికాలో మీడియా తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత విద్యత్ పై స్పందించారు . ఉచిత విద్యత్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఏమి ఉచితం అంటూ ఆయన చేసియాన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని లేపాయి. కేటీఆర్ రేవంత్ రెడ్డి మాటలపై ఘాటుగా స్పందించారు .ఉచితానికి కాంగ్రెస్ వ్యతిరేకమని వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంతే సంగతులని రైతులు గుర్తుంచుకోవాలని అన్నారు .దీనిపై మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , గంగుల కమలాకర్ , విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ,మల్లారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీపైనా రేవంత్ పైన మాటల దాడి చేశారు . కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ రేవంత్ ఆలా అంటే తప్పేనని అయినా సీనియర్ నేను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ను మాకు ఎవరికీ తెల్వకుండా ఆలా అంటే కరెక్ట్ కాదు .అయితే సందర్భం తెలుసుకోవాలని అన్నారు .

తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తాము బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని, దీనిని నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశంతో రాద్ధాంతం చేస్తూ కుట్రకు తెరలేపిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని దీనిని బట్టి మరోసారి తేలిపోయిందన్నారు. తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన పీసీసీ చీఫ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో స్పందించారు. సత్యాగ్రహ దీక్షని నీరుగార్చడానికి బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తెచ్చి, దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 

బీఆర్ఎస్ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి, తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసాలకు నిరసనగా రాష్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

రేవంత్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్

  • ఉచిత విద్యుత్ రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ది అన్న మంత్రి
  • కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు మరోసారి వెల్లడయ్యాయని విమర్శ
  • కాంగ్రెస్ ఆలోచనలను ప్రజలు, రైతులు వ్యతిరేకించాలని పిలుపు

ఉచిత విద్యుత్ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మంగళవారం స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. గతంలోనూ రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎనిమిది గంటల విద్యుత్ మాత్రమే ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పడం ద్వారా ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు మరోసారి వెల్లడయ్యాయన్నారు.

కాంగ్రెస్ ఆలోచనలను తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలపై ఈ రోజు, రేపు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కులు, మనాలిలో విద్యార్థులు చిక్కుకున్నట్లు బాధితుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషన్ ను అప్రమత్తం చేశామని, బాధిత విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. సహాయం కోసం టీఎస్ భవన్, కేటీఆర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Related posts

ఉద్దవ్ కు కొత్త తలనొప్పి …ముర్ము కు మద్దతుపై కాంగ్రెస్ గరం గరం ….

Drukpadam

తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ… వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్…

Drukpadam

సాయి గణేష్ హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ :ఈటల రాజేందర్!

Drukpadam

Leave a Comment