Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే?: పోచారం

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించింది చంద్రబాబే.. ఎందుకంటే?: పోచారం

  • కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకే తన ఏజెంట్ రేవంత్ ను పంపించారని ఆరోపణ
  • బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం కాదన్న పోచారం
  • రేవంత్ సీఎం ఆశలు కల్లలే అవుతాయని మండిపాటు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే రేవంత్ ను చంద్రబాబు ఆ పార్టీలోకి పంపించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్యుత్ పైన పీసీసీ చీఫ్ కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ అధినేతను కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు సమర్థిస్తున్నారని విమర్శించారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమని చేసే ఆరోపణల్లో పస లేదన్నారు. నాడు కరెంట్ బిల్లులు పెంచవద్దని అసెంబ్లీలోనే చంద్రబాబును కేసీఆర్ నిలదీశారన్నారు.

రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి సీఎం కావాలని కలలు కంటున్నాడని, ఆ ఆశలు కల్లలుగానే మిగలడం ఖాయమన్నారు. హైదరాబాద్ చుట్టూ భూకబ్జాలు చేయడం, దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం, డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేయడం రేవంత్ నైజం అన్నారు. ఈసారి కాంగ్రెస్ కు గతంలో కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోన్న ఏకైక సీఎం కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ గెలుపును మూడోసారి ఎవరూ ఆపలేరని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారన్నారు. సర్వేలన్నీ కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు.

Related posts

సీఎం గారు కుర్చీ ఎక్కడ …పోడుభూముల ధర్నాలో నాయకుల ప్రశ్న ?

Drukpadam

విశ్వనగరం హైద్రాబాద్ నివాస యోగ్యానికి పనికి రాదట …!

Drukpadam

ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా?: చంద్రబాబు ఆగ్రహం!

Drukpadam

Leave a Comment