Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఆగస్టు 9న చలో హైదరాబాద్….

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఆగస్టు 9న చలో హైదరాబాద్….
ఇందిరా పార్క్ వద్ద ధర్నా
రిటైర్డ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం
నెల నెల మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వాలి
పెండింగ్ లో ఉన్న డి ఏ లను ప్రకటించి విడుదల చేయాలి
హెల్త్ కార్డు ఇన్సూరెన్సు స్కీమ్ అమలు చేయాలి
పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఆగస్ట్ 9 న చలో హైద్రాబాద్ కార్యక్రం చేపట్టినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శరత్ బాబు తెలిపారు . ఖమ్మం జిల్లా నుంచి రిటైర్డ్ ఉద్యోగులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు .. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు స్తంభాద్రి బ్యాంక్ చైర్మన్ రామారావు మరియు రాష్ట్ర కార్యదర్శి పి శరత్ బాబు రిటైర్డ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్షత చూపుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . పిఆర్సి ప్రకటించకపోవడం డిఏలు విడుదల చేయకపోవడం పై వారు ప్రభుత్వాన్ని తప్పు పట్టారు . ప్రతి నెల మొదటి తారీకున పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . అనేక రకాల బిల్లులను ఈ కుబేర్ పేరా ట్రెజరీ కార్యాలయంలో పెండింగ్ లో ఉంచడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు . హెల్త్ ఇన్సూరెన్స్ స్కిమ్ ఉన్న సరిగా అమలుకు నోచుకోక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . పై సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 9న ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాలు జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగులంతా పాల్గొనాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య జిల్లా కార్యదర్శిలు తాళ్లూరి వేణు జనార్దన్ రావు జిల్లా నాయకులు చెంచు రెడ్డి ఉపేందర్ రావు సాంబశివరావు ఖాజా మొయినుద్దీన్ పూర్ణచందర్రావు బాబురావు ఎం సత్యనారాయణ రఘుపతి రెడ్డి మీ ఉపేందర్ రావు డీకే శర్మ తదితరులు పాల్గొన్నారు..

Related posts

దయచేసి మా ఇద్దరిపై ఆ ప్రచారాన్ని ఆపేయండి: బండి సంజయ్

Drukpadam

డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

మీ గురించి దేశానికి తెలిసిపోయిందని భయపడుతున్నారా? అంటూ కేటీఆర్‌‌పై బండి సంజయ్‌ సెటైర్

Ram Narayana

Leave a Comment