- కులాలు, మతాలపరంగా కాకుండా ప్రజలకు మంచి చేయాలనే బీజేపీలో చేరానని వెల్లడి
- మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని ప్రశంస
- బీజేపీలో చేరికపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయన్న జయసుధ
- తన పోటీపై జరిగేదంతా ప్రచారం మాత్రమేనని స్పష్టీకరణ
కులాలు, మతాలపరంగా కాకుండా తాను ప్రజలందరికీ మంచి చేయాలనుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె నేడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, అందరికీ తెలిసిందేనన్నారు.
తాను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చునని, కానీ కులాలపరంగా కాకుండా మంచి కోసం పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. బీజేపీలో చేరడంపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయని, అమిత్ షాను కూడా కలిశామన్నారు. నటిగా తాను అందరికీ చెందిన వ్యక్తిని అన్నారు. ప్రజలకు… పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు చెప్పారు. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్‌ల నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. తాను ఇక సినిమాల కంటే రాజకీయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు.
తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటి జయసుధ
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్
- మోదీ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చారన్న బీజేపీ నేత
- జయసుధ రాకతో బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్న కిషన్ రెడ్డి
ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ… గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరినట్లు చెప్పారు. తెలుగు సహా వివిధ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారని, ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. ఆమెకు ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయన్నారు. సినీ పరిశ్రమలో ఆమెకు మంచి పేరు ఉందన్నారు. 2009 నుండి 2014 వరకు ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జయసుధ బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి, దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటించారన్నారు. ఆమె రాక బీజేపీకి లాభమని, బీజేపీలో మరింత ఉత్సాహం వస్తుందన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి కోసం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేశారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని యావత్ తెలంగాణ కోరుకుంటోందన్నారు.
జయసుధ బీజేపీలో చేరిక కోసం ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లినట్లు …?
సినీనటి మాజీ శాసనసభ్యురాలు జయసుధ బీజేపీలో చేరడం వరకు ఒకే …అందుకు ఎలాంటి అభ్యంతరంలేదు .కాకపోతే ఆమె చేరిక అమిత్ షా లేదా జెపి నడ్డా సమక్షంలో చేరతారని అందుకే ఢిల్లీ వెళ్లారని అందరు భావించారు .కానీ నిత్యం తెలంగాణకు వచ్చే రాష్ట్ర ప్రతి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ ,రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీ వెళ్లి చేరడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అందురు చెప్పినట్లుగానే దేశంలో ప్రధాని మోడీ పాలనా చూసి బీజేపీలో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేరానని చెప్పడం పాత చింతకాయ పచ్చడిలా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి…