Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీఆర్ యస్ గుడ్ బై చెప్పేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు …భట్టి

బీఆర్ యస్ గుడ్ బై చెప్పేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు …భట్టి
కాంగ్రెస్ లో భారీగా చేరికల వెనుక కారణం ఇదేనన్నభట్టి
షర్మిల కాంగ్రెస్ లో చేరిక అంశం తన దృష్టిలో లేదని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమయ్యామని స్పష్టీకరణ
శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ సిద్ధమైందని అన్నారు .
అనేక అంశాలు చర్చించాల్సి ఉందని అన్నారు .
ఇటీవల భారీ వర్షాలు ,వరదలు ప్రాణనష్టం విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీస్తాం …
పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన విషయాలు లేవనెత్తుతా….
ఢిల్లీ మీడియాతో భట్టి…..చిట్ చాట్ ….కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చానని వెల్లడి …

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చాలామంది నేతలు అనుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ లో భారీగా చేరికల వెనుక ఉన్న కారణం ఇదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేరిక అంశం తన దృష్టిలో లేదని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తమ పార్టీ హైకమాండ్ ను కలుస్తున్నానని భట్టి వెల్లడించారు.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, పూర్తిగా సన్నద్ధమయ్యామని తెలిపారు. అనేక అంశాలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల మేర అప్పులపాలైందని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు , వరదల వల్ల జరిగిన ఆస్తి ,ప్రాణనష్టంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు .గోదావరి ,మున్నేరు , వరంగల్ నగరం ,ఖమ్మం ,భద్రాచలం ములుగు జిల్లాలోని కొండాయిగూడెం , మోరంచపల్లి లో జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని భట్టి తప్పు పట్టారు .వర్షాకాలం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకోని ఉంటె నష్టనివారణ చేయవచ్చునని అభిప్రాయపడ్డారు …

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ఆకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. ఇటీవల తన పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను దగ్గర్నుంచి చూసి తెలుసుకున్నానని చెప్పారు. 1368 కి .మీ దూరం 38 నియోజకవర్గాల గుండా చేసిన పాదయాత్రలో స్వయంగా ప్రజలను దగ్గర నుంచి చూసి వారి భాదలు తెలుసుకొనే అవకాశం కలిగిందని అన్నారు .అంతకు ముందు తన నియోజకవర్గమైన మధిరలో కూడా పాదయాత్ర నిర్వహించిన విషయాన్నీ గుర్తు చేశారు ….

Related posts

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

Drukpadam

సీఎం వ్యాఖ్యలపట్ల -ఐజేయూ,టీయూడబ్ల్యూజే హర్షం …అభ్యంతరం ….

Ram Narayana

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment