Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రైతుల రుణమాఫీ పై మార్గదర్శకాలు ….ఈ విధంగా ఉండే అవకాశం ఉంది…?

రైతుల రుణమాఫీ పై మార్గదర్శకాలు ….ఈ విధంగా ఉండే అవకాశం ఉంది…!
-రైతు రుణమాఫీ పై నిబంధనలు …డిసెంబర్ 11 .2018 నాటికీ ఉన్న అప్పులకే రుణమాఫీ వరిస్తుంది …
-రైతు రుణ మాఫీ పై వివరణలు – రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ?
-తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఉన్న రైతులకు మాత్రమే. రుణమాఫీ వర్తిస్తుంది..

  • రుణమాఫీ ఎంత వరకు వస్తుంది ?

సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు . దీంతో లక్ష రూపాలవరకు ఋణం పొందిన రైతులు ఆశతో తమకు రుణమాఫీ అవుతుందని ఆశతో ఉన్నారు . సీఎం రుణమాఫీ అంశం 2018 ఎన్నికల్లో చెప్పింది. 2018 డిసెంబర్ 11 లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని సమాచారం …దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది…

లక్ష మాత్రమే రుణమాఫీ …

కుటుంబానికి రూ లక్ష వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.
భార్యకు 70 వేలు , భర్తకు 80 అప్పు ఉంటె ఇద్దరికీ కలిపి లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది… మిగతా 50 వేలు రూపాయలు చెల్లించాల్సిందే …

-తేది 11-12-2018 నాటికి బ్యాంకులో రూ॥ 1,60,000/- అప్పు ఉంది.
వారికి రుణమాఫీ వస్తుందా? పైన చెప్పిన విధంగా లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.మిగతా 60 వేల రూపాయలు రైతు చెల్లించాల్సిందే …

  • తేది 11-12-2018 నాటికి రూ॥ 30,000/- అప్పు ఉండి, ప్రస్తుతం అప్పు రూ 1,00,000/- ఉన్న వారికి రూ॥ లక్ష్మ రుణమాఫీ వస్తుందా? ఆరోజువరకు ఉన్న 30 వేలకు మాత్రమే మాఫీ వర్తిస్తుంది….

నిబంధనల ప్రకారం తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత అయి ఉంటుందో అంతే రుణమాఫీ వస్తుంది.

  • తేది 11-12-2018 వరకు రూ॥ 1,00,000/- అప్పు ఉండి తేని 31-07-201 నాడు రూ|| 5000/- వరకు అప్పును పునరుద్ధరన చేసుకున్న వారికి రుణమని వస్తుందా? ఎంత వరకు వస్తుంది.? రెన్యువల్ కి రుణమాఫీ కి ఎలాంటి సంబంధం లేదు. తేది 11-12-2018 తరువాత అప్పుని రెన్యువల్ చేసుకున్నా, మరియు అప్పు మొత్తం కట్టి. క్లోజ్ చేసుకున్న రుణమాఫీ కి అర్హులే అని అంటున్నారు . చెల్లించిన లక్షను తిరిగి రైతు ఖాతాలో జమచేస్తారా లేదా ..అనేదానిపై ఇంకా స్పష్టతలేదు … తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత ఉంటుందో ( రూ. లక్ష వరకు) రుణమాఫీ కూడా అంతే వస్తుంది. కాబట్టి రూ.లక్ష వరకు రుణమాఫీ వస్తుంది….

-తేది 11-12-2018 నాటికి భార్యకు రూ॥ 50,000/- అప్పు ఉండి మరియు భర్తకు రూ॥ 70,000/- అప్పు ఉన్నచో రుణమాఫీ ఎంత వరకు వస్తుంది !
కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి భార్యకు
రూ. 50,000/- మరియు భర్తకు రూ॥ 50,000/- రుణమాఫీ వస్తుంది..

  • తేది 11-12-2012 నాటికి భార్యకు రూ 1,10,000/- భర్తకు 1,60,000/- ఉన్నా రుణమాఫీ ఎంత వస్తుంది ?

భార్య లేదా భర్త, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే రూ॥ లక్ష వరకు రుణమాఫి వస్తుంది.

  • తేది 11-12-2012. తరువాత తీసుకున్న కొత్త రుణాలకు మాఫీ వస్తుందా?
    తేది 11-12-2018 తరువాత తీసుకున్న రుణాలకు మాత్రం రుణమాఫీ వర్తించదు. కాబట్టి రైతులు ప్రభుత్వం నియమనిబంధనలను తెలుసుకొని బ్యాంకు లను సంప్రదించాల్సి ఉంటుంది…

తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. 37 వేల నుంచి 41 వేల వరకు రుణమాఫీ కోసం ఆర్థికశాఖ 167.59 కోట్లు విడుదల చేసింది. దీంతో 44 వేల 870 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. Also Read – ఆర్టీసీ బస్సులో పాము కలకలకం.. పామును గమనించి పిల్లల కేకలు రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలన్నర రోజుల్లో… అంటే సెప్టెంబరు రెండో వారం వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే… తాజాగా.. 37 వేల నుంచి 41 వేల వరకు రుణమాఫీకి సంబంధించి ఆర్థికశాఖ 167.59 కోట్లు విడుదల చేసింది.

Related posts

ఫ్యాన్సీ నెంబర్ మోజు …18 లక్షలకు 9999 నెంబర్ పొందిన యజమాని …!

Ram Narayana

ప్రజలనే కాదు …భద్రాద్రి రాముణ్ణి సైతం మోసం చేసిన సీఎం కేసీఆర్ …సీఎల్పీ నేత భట్టి ఫైర్

Ram Narayana

జిల్లాల తగ్గింపు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు …!

Ram Narayana

Leave a Comment