Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

శరీరంలో అత్యంత ముఖ్యమైన జాయింట్ ఇది.. దీని పట్ల జాగ్రత్త

  • జీవిత కాలంలో 80 శాతం బరువును మోసే మోకీలు
  • వృద్ధాప్యంలో మోకీలు శస్త్రచికిత్స వద్దనుకుంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి
  • నడక, ఈత, సైక్లింగ్ వ్యాయామాలకు పరిమితం కావాలి

మన శరీర బరువును మోసే అత్యంత ముఖ్యమైన కీలు.. మోకీలు. 15-20 ఏళ్ల క్రితంతో పోలిస్తే నేడు మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకని అని విశ్లేషిస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోకీలు పట్ల అశ్రద్ధ పనికిరాదని, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే వృద్దాప్యంలో శస్త్రచికిత్సల అవసరం ఏర్పడదని నిపుణులు సూచిస్తున్నారు.

మన రోజువారీ జీవితంలో నడకతోపాటు, బరువులు మోయడం, ప్రతి కదలికలోనూ మోకీలు సేవలు కీలకంగా పనిచేస్తుంటాయి. మన జీవిత కాలంలో 80 శాతం బరువును మోకీలే మోస్తుంటుంది. మెట్లు ఎక్కడం, నడవడమే కాదు.. వంగినప్పుడు, జంప్ చేసినప్పుడు, డ్యాన్స్ చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు మోకీలు సేవలు కీలకంగా మారతాయని డాక్టర్ శ్రీరామ్ నెనే తెలిపారు.

మోకీలు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని రకాల వ్యాయామాలు తప్పకుండా చేసుకోవాలి. ఈత కొట్టడం, నడవడం, సైకిల్ తొక్కడం ఇవన్నీ మేలు చేస్తాయి. ఫిజియోథెరపిస్ట్ ని ఒకసారి కలిస్తే నీ స్ట్రెంతెన్ ఎక్సర్ సైజ్ లను చేసి చూపిస్తారు. ఆ తర్వాత రోజువారీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి యూట్యూబ్ లో వీడియోలు కూడా లభిస్తాయి. 

బరువులు ఎత్తడం తదితర కఠిన వ్యాయామాలు చేయడానికి ముందు మోకాళ్ల గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఒకేసారి అధిక బరువు వేయకుండా క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. జాగింగ్, ఫుట్ బాల్ బాస్కెట్ బాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి కారణంగా మోకీలుకి గాయాలు అవుతాయి. బరువులు ఎత్తేటప్పుడు మోకాలికి బ్రేస్ వేసుకోవాలి. 

ఇక మోకీలుపై అధిక బరువు పడకుండా ఉండాలంటే, శరీర బరువు పరిమితికి మించి లేకుండా చూసుకోవాలి. సరైన పాదరక్షలు ధరించాలి. కనీసం గంటకు ఒకసారి అయినా లేచి రెండు నిమిషాలపాటు నడవాలి.

Related posts

బీపీ చెక్​ చేసుకుంటున్నారా… సరైన రీడింగ్​ రావాలంటే ఇలా చేయాలి!

Ram Narayana

ముంచుకొస్తున్న మరో ముప్పు.. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేస్తున్న బాక్టీరియాతో అమెరికాలో ముగ్గురి మృతి

Ram Narayana

ఈ మూడూ తీసుకుంటే కావాల్సినంత ప్రొటీన్

Ram Narayana

Leave a Comment