అంతర్జాతీయం

రష్యాలో భారీ పేలుడు: 27 మంది మృతి.. మాస్కోకు పలువురి ఎయిర్‌లిఫ్ట్

  • కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో ప్రారంభమైన మంటలు గ్యాస్ స్టేషన్‌కు వ్యాప్తి
  • మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు
  • క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దర్యాఫ్తు ప్రారంభించిన అధికారులు

రష్యాలోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై, సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం మాస్కోకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. రష్యా అధికారులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దర్యాఫ్తు ప్రారంభించారు.

Related posts

ఇరాన్ పగ్గాలు చేపట్టిన ఖమేనీ కుమారుడు ముజ్తబా…

Ram Narayana

అమెరికా రక్షణశాఖతో ఒప్పందం… ఓపెన్ఏఐలో దుమారం… రోబోటిక్స్ చీఫ్ రాజీనామా!

Ram Narayana

భారత్-పాక్ ఉద్రిక్తతలను మేమే తగ్గించాం.. చైనా సంచలన వ్యాఖ్యలు

Ram Narayana