Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాలేరులో తుమ్మల అనుచరుల తిరుగుబాటు …కందాల ఓటమే ద్యేయంగా పనిచేయాలని నిర్ణయం…

పాలేరులో తుమ్మల అనుచరుల తిరుగుబాటు …కందాల ఓటమే ద్యేయంగా పనిచేయాలని నిర్ణయం…
-ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ లో సమావేశం
-తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే ఉంటామని తీర్మానం
-తుమ్మల కాంగ్రెస్ లోకి వెళుతున్నారని ప్రచారం…
-ఏమైనా జరిగివచ్చు అంటున్న తుమ్మల అనుచరులు

బీఆర్ యస్ అభ్యర్థుల ప్రకటన ఆపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది…టికెట్ దక్కని అనేకమంది నేతలు పార్టీ వీడేందుకు సిద్దపడుతున్నారు. బీఆర్ యస్ నేత సీఎం కేసీఆర్ వైఖరిపై భగ్గుమమంటున్నారు .ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని మాజీ మంత్రి తుమ్మల అనుచరులు మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశం అయ్యారు . నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 250 మంది తుమ్మల అభిమానులు ఈసమావేశానికి హాజరైయ్యారు . తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని సమావేశంలో ప్రసంగించిన నేతలు తీవ్రంగా ఖండించారు . గత ఎన్నికల్లో తుమ్మల ఓటమి ఎలా జరిగిందనేది తెలిసిన సీఎం కేసీఆర్ తుమ్మలకు టికెట్ నిరాకరించడాన్ని తప్పు పట్టారు . కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే కందాల కు తిరిగి టికెట్ ఇవ్వడంపై వారు భగ్గుమన్నారు . కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే పాలేరు నియోజకవర్గానికి తుమ్మల చేసిన అభివృద్ధిని , సేవలను కొనియాడారు . కందాల ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు ఏమిలేవని వారు పేర్కొన్నారు. పాలేరులో తుమ్మలకు టికెట్ నిరాకరించడం పెద్ద తప్పిదనమని ,అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు …

సీనియర్ మంత్రిగా ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలకంగా వ్యహరించి అభివృద్ధి ప్రదాతగా నిలిచారని అన్నారు . టీడీపీలో ఉన్న తుమ్మల సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాడు టీఆర్ యస్ లో చేరిన విషయాన్నీ గుర్తు చేశారు . అలంటి వ్యక్తికి టికెట్ నిరాకరించి అవమానపరచడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు . అనేక సందర్భాల్లో పార్టీ అవమానించినప్పటికీ కేసీఆర్ కు ఇచ్చిన మాట కోసం తుమ్మల నిలబడ్డారని వారు పేర్కొన్నారు . అయినప్పటికీ తుమ్మలను పక్కన బెట్టడంపై బీఆర్ యస్ కార్యకర్తలు , తుమ్మల అనుయాయిలు మండిపడుతున్నారు . తుమ్మల ఏ నిర్ణయం తుసుకున్న ఆయన వెంట నడుస్తామని వారు ముక్త కంఠం తో నినదించారు . సమావేశంలో ఖమ్మం రూరల్ , తిరుమలాయపాలెం ,కూసుమంచి , నేలకొండపల్లి మండలాల నుంచి అభిమానులు హాజరైయ్యారు . మద్ది మల్లారెడ్డి , శాఖమూరి రమేష్ , బండి జగదీష్ , జొన్నల గడ్డ రవి , వెన్నపూసల సీతారాములు ,రాందాసు తదితరులు పాల్గొన్నారు ..

తుమ్మల కాంగ్రెస్ లోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం …

తుమ్మల నాగేశ్వరరావు కు బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ పాలేరు టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..బీఆర్ యస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన వెంటనే తుమ్మల అనుయాయిలు , స్నేహితులు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు . ఆయన భవిష్యత్ వ్యూహంపై తర్జన భర్జనలు జరిగాయి. అందులో పాలేరు , ఖమ్మం నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు సమాచారం… అయితే కాంగ్రెస్ లో చేరాలని కొంతమంది సూచించారని మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థిగా పాలేరు లో పోటీచేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఆయన పోటీ చేయాలనీ మాత్రం అందరు ఏకాభిప్రాయానికి వచ్చారు . పార్టీ ఏదైనా పోటీ ఖాయం అనే అభిప్రాయానికి తుమ్మల సైతం వచ్చారు . కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంటె ఆలోచించాలని లేకపోతె పాలేరు లో తన తడాకా చూపించాలనే ఆలోచనలో ఉన్నారు …బీజేపీ కూడా ఆయనకు గాలం వేస్తున్నాయి. అయితే జిల్లాలో బీజేపీకి ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆయన సహచరులు సైతం బీజేపీ వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు . చూద్దాం ఏమిజరుగుతుందో…..

Related posts

మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ప్రాంతీయ సదస్సులు-టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

Drukpadam

కల్లాల లో ఉన్న ధాన్యం నిల్వలను సత్వరం కొనుగుళ్ళుకు ఏర్పాటు చేయండి:ఎమ్మెల్యే సండ్ర

Drukpadam

మీ చుట్టూ తిరిగినప్పుడు ఎక్కడికి పోయారు మీరు?: సజ్జలను ప్రశ్నించిన బొప్పరాజు

Drukpadam

Leave a Comment