- వైజాగ్, ఇతర నగరాల నుంచి సింగపూర్ వెళ్లే వారికి ప్రత్యేక ఆఫర్
- ప్రకటించిన సింగపూర్ విమానయాన సంస్థ స్కూట్
- సెప్టెంబర్ ఒకటో తేదీ వరకే డిస్కౌంట్ ఆఫర్
సింగపూర్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు బంపరాఫర్. కేవలం రూ.6300 రూపాయలకే సింగపూర్ విమానం ఎక్కొచ్చు. ఈ మేరకు ‘స్కూట్’ అనే సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ భారత ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. వైజాగ్ తో పాటు దేశంలోని పలు నగరాల నుంచి అత్యల్ప రేట్లకు సింగపూర్ వెళ్లేందుకు టికెట్లను విక్రయిస్తున్నట్టు తెలిపింది. నిన్న మొదలైన ఈ ఆఫర్ సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు రోజుల సమయంలో సింగపూర్ లోని వివిధ ప్రాంతాలకు డిసెంబర్ 14వ తేదీ వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను మాతమ్రే అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చని సదరు సంస్థ తెలిపింది.