ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు.. 122 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం…!
కరువు దిశగా
జులైలో భారీ వర్షాలతో బెంబేలు
ఆగస్టులో చుక్క వాన కరవు
నాగార్జునసాగర్ కింద 6 లక్షలకు ఎఫెక్ట్
వరుణుడికోసం రైతుల ఎదురు చూపులు
జులైలో భారీ వర్షాలతో బెంబేలెత్తించిన వరుణుడు ఆగస్టులో మాత్రం ముఖం చాటేశాడు. 122 సంవత్సరాల తర్వాత ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఆగస్టు నెలలో సగటున 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే 36 శాతం తక్కువగా 162.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2005లో 191.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఈ ఆగస్టులో దక్షిణ భారతదేశంలో 190.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఏకంగా 60శాతం తక్కువగా 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 122 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అంతకుముందు 1968లో ఇదే నెలలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ తెలిపింది.
ప్రధానంగా నాగార్జునసాగర్ ఎడమ కాలవ కింద తెలంగాణాలో 6 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు సాగు ప్రారంభం కాకపోవడంతో రైతుల బెంబేలెత్తుతున్నారు .ఒక పక్క ఏపీ శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకోని వెళ్ళ్తుండగా తెలంగాణ కళ్లప్పగించి చూస్తుంది….నాగార్జునసాగర్ ప్రాజక్ట్ లోకి నీరు పూర్తీ స్థాయిలో వచ్చిన తర్వాతనే ఒకసారి వదలాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వర్షాలు రాక ప్రాజక్ట్ నిండక వర్ణుడికోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు …గత రెండు రోజులుగా తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ సాగర్ ప్రాజక్ట్ నిండేంతగా రాలేదు …అసలే ఎన్నికల సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దానిప్రభావం అధికార పార్టీ మీద ఉంటుంది.అందువల్ల అధికార పార్టీ సైతం అధిక వర్షాలకు వరుణదేవుడికి ప్రార్థనలు చేస్తుంది….