Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ చెపితేనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చానన్న మైనంపల్లి…!

కేసీఆర్ చెపితేనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చానన్న మైనంపల్లి
బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నా.. వచ్చాకే నిర్ణయం
తానెప్పుడూ పార్టీ గీత దాటి ప్రవర్తించలేదని స్పష్టీకరణ
తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనన్న హన్మంతరావు

బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి కథ కొత్త మలుపులు తిరుగుతుంది….కొద్దిరోజుల క్రితం తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా మంత్రి హరీష్ రావు పై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తిన మైనంపల్లి తాజాగా కేసీఆర్ సలహా మేరకే తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చానని వెల్లడించడం రాజకీయవర్గాల్లో ఆశక్తిగామారింది. ఇంతకీ మైనంపల్లిపై బీఆర్ యస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..ఆయనకు ప్రకటించిన విధంగా టికెట్ ఇస్తుందా…? లేక మరొకరి ఆ టికెట్ ఇస్తుందా అనే చర్చకూడ జరుగుతుంది…మైనంపల్లి హరీష్ రావు పై విమర్శలు చేసిన వెంటనే యూఎస్ లో ఉన్న కేటీఆర్ ,ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ ఆయన చర్యలు ఖండించారు . అయినప్పటికీ ఆయన తన విమర్శలను కొనసాగించారు .తర్వాత తన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పడు చేసి తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు …తన కుమారుడు మెదక్ నుంచి పోటీచేస్తాడని తెలిపారు …

ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితేనే తాను తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, ఇప్పుడేమో టికెట్ ఇవ్వనంటే ఎలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రశ్నించారు. మల్కాజిగిరిలో నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. తానెప్పుడూ పార్టీ గీత దాటి ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు.

మేడ్చల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో తన కుమారుడిని చూసిన సీఎం కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకురమ్మని తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. సీఎం ప్రోత్సాహంతోనే మెదక్‌లో తన కుమారుడు మైనంపల్లి సేవా సంస్థ తరపున ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు. తాను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనానికి వెళ్తున్నానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని మైనంపల్లి ప్రకటించారు.

Related posts

బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ స్టేషన్‌లో కేసు నమోదు

Ram Narayana

60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు: ఈటల రాజేందర్ కౌంటర్

Ram Narayana

 కేసీఆర్… నిరాహార దీక్ష సమయంలో నువ్వు జ్యూస్ తాగిన విషయం మరిచిపోయావా?: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment