ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ యస్ …అభ్యర్థులపై కుస్తీలు పడుతున్న కాంగ్రెస్ …!
తమకంటే తమకే సీట్లు కావాలని పట్టు బడుతున్న నేతలు
సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక అంటున్న నేతలు ..
1006 దరఖాస్తులు …కొనసాగుతున్న వడపోత
సర్వేలు గిర్వేలు జంట నహి ..మేము చెప్పినవారికి టికెట్స్ ఇవ్వాల్సిందేనని పట్టు
ఇప్పటికే నాయకులను నమ్మి నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిన నేతలు
టికెట్ రాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన
ఒక పక్క జమిలి ఎన్నికల ప్రచారం ..మరోపక్క తెలంగాణలో జరగనున్న ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు ముమ్మరంగం జరుగుతుంది…ఇప్పటికే అధికార బీఆర్ యస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది..పనిలో పనిగా ప్రజలను ఆకట్టుకొనే పథకాలను ప్రకటిస్తుంది….అస్త్రశస్త్రాలను ఉపయోగించి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పక్క వ్యూహంతో ముందుకు పోతున్నారు . కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక పై కుస్తీలు పడుతుంది… బీజేపీ కూడా పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది…
గాంధీ భవనంలో రెండవసారి ఎన్నికల్లో పోటీకోసం నియోజకవర్గాలవారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది… 25 నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది… మరో 94 నియోజకవర్గాలపై రేవంత్ బృందం కసరత్తు చేస్తుంది… ఒక్క నియోజకవర్గం నుంచి ముగ్గరు పేర్లతో పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు ..
1,006 దరఖాస్తుల పరిశీలన
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కోసం అన్ని పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి . అధికార బీఆర్ఎస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసి అన్ని పార్టీల కంటే ముందు ఎన్నికల యుద్ధరంగంలోకి దిగింది . కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై కుస్తీపడుతుంది…. ఒక్కొక్క నియోజకవర్గానికి సరాసరి 8 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం నుంచి 32 మంది కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపారు ..టీపీసీసీ అధ్యక్షుడు పోటీచేస్తున్న కొడంగల్ కు ఆయనపేరుతో ఒకే ఒక్క అప్లికేషన్ వచ్చింది….ఇక సీఎల్పీ నేత భట్టి , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , ములుగు సీతక్క , శ్రీధర్ బాబు , జగ్గారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు పోటీచేయాలని అనుకున్న నియోజకవర్గాలకు ఒకటి అర మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయి…ఇలా 25 నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులపై పెద్దగా అభ్యంతరాలు లేవు…
ఈ క్రమంలో, హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ (ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ) భేటీ అయింది. ఈ సమావేశానికి 29 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు. టికెట్ ఆశావహుల వ్యక్తిగత సమాచారాన్ని పీఈసీ సభ్యులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మరో 94 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై రేవంత్ బృందం కసరత్తులు చేస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికను పీఈసీ సిద్ధం చేయనుంది. అందుకోసం 1,006 దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.
మరి జమిలి ఎన్నికలు అంటే పరిస్థితి ఏమిటి అనేది అర్ధం గాక తలలు పట్టుకుంటున్నారు నేతలు …బీజేపీ మాత్రం ఒక పక్క జమిలి కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆధ్వరంలో 8 మంది సభ్యులతో కమిటీ వేసింది. అయితే జమిలి ఎన్నికలపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ కమిటీలో సభ్యుడిగా నియమించిన కాంగ్రెస్ లోకసభ పక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి తాను కమిటీలో ఉండనని తేల్చి చెప్పారు . కమిటీలో బీజేపీ వాదనలను బలపరిచేవాళ్లనే నియమించడంపై విమర్శలు ఉన్నాయి.
ఒక వేళ జమిలి ఎన్నికలకు రేపు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ లో చట్టం అయితే తెలంగాణ లాంటి ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన తెస్తారని సందేహాలు ఉన్నాయి. దీంతోపాటు రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. నిజంగా జమిలి ఎన్నికలు సాధ్యమేనా …? కేంద్ర ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ ఆడుతుందా ..? అనే చర్చ కూడా జరుగుతుంది…