Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని పై వసంత నాగేశ్వరరావు ప్రసంశలు …ఇలాంటి ఎంపీని తన జీవితం చూడలేదని వ్యాఖ్య…

 కేశినేని నానిని మరోసారి గెలిపించాలి: వసంత నాగేశ్వరరావు

  • కేశినేని అభివృద్ధి పనులు చేశారన్న వసంత నాగేశ్వరరావు
  • మరోసారి గెలిపిస్తే మిగతా పనులు చేస్తారన్న మాజీ మంత్రి
  • గతంలో కేఎల్ రావు ఎలా పని చేశారో అలా చేస్తున్నారని కితాబు
  • టీడీపీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లోను ఇదే పార్టీ నుండి పోటీ చేస్తానని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి లోక్ సభకు వెళ్తానని ధీమా
  • చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేని నాయకుడని కితాబు

విజయవాడ ఎంపీగా కేశినేని నాని మరోసారి గెలవాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ఎంపీగా కేశినేని చాలా బాగా పనులు చేశారని కితాబునిచ్చారు. మరోసారి గెలిస్తే మిగతా పనులు కూడా పూర్తి చేస్తారన్నారు. అందుకే ఆయనను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను చాలామంది ఎంపీలను చూశానని, కానీ రెండు రోజుల్లోనే బ్రిడ్జిని శాంక్షన్ చేయించిన వ్యక్తి కేశినేని అన్నారు.

ఆయన పనితీరును ప్రజలంతా చూశారన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. గతంలో కేఎల్ రావు ఎలా పని చేశారో, ఇప్పుడు ఈయన అలాగే పని చేస్తున్నారన్నారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎంపీని చూడలేదన్నారు. కాగా, కేశినేని నాని వచ్చే ఎన్నికల్లోను టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ఈ రోజు స్పష్టం చేశారు.

టీడీపీని వీడుతున్నారనే ప్రచారంపై ఎంపీ కేశినేని నాని స్పందన

తాను పార్టీ మారుతానని జరుగుతోన్న ప్రచారంపై విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తాను తెలుగుదేశం పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి తాను మూడోసారి లోక్ సభకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని, అప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పార్టీల మధ్య పొత్తుల గురించి అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రూ.118 కోట్ల అవకతవకల గురించి ఐటీ నోటీసులు రావడంపై కూడా ఎంపీ స్పందించారు. దేశంలో నిజాయతీ కలిగిన అతికొద్దిమంది నేతల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబు ఒకరని అన్నారు. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని, దానికి ఆయన సమాధానం ఇస్తారన్నారు.

Related posts

జగన్ కు ఆర్కే అత్యంత సన్నిహితుడు.. అంచనాలను అందుకోలేననే రాజీనామా చేసి ఉండొచ్చు: అయోధ్య రామిరెడ్డి

Ram Narayana

గుంటూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే, మేయర్ మధ్య వాగ్వాదం

Ram Narayana

 ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు

Ram Narayana

Leave a Comment