Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు అరెస్ట్ …పవన్ కళ్యాణ్ హంగామా …అడ్డగించిన పోలీసులు …

రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు…
కాలినడకన మంగళగిరి బయల్దేరిన జనసేనాని
జగ్గయ్యపేటకు తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు
పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట
ఏపీలోకి వచ్చేందుకు వీసా, పాస్ పోర్ట్ కావాలేమో అన్న పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ జనసేన అధినేత…చంద్రబాబు స్కీల్ డవలప్మెంట్ అరెస్ట్ అయిన నేపథ్యంలో
టీడీపీ కార్యకర్తలు ,నాయకులకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ స్పందించారు . చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ,దుర్మార్గమని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు ..సొంతపుత్రుడు లోకేష్ సైలంట్ అయితే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వైలెంట్ అయ్యారని వైసీపీ నేతలు మండి పడుతున్నారు … ఒక రాజకీయ నేతగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంలో తప్పులేదు …కానీ ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేశారు .అది సాధ్యం కాకపోవడంతో రోడ్ మార్గం గుండా వచ్చారు .జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకున్న తన కాలినడకన మంగళగిరికి బయలు దేరడం వైసీపీ విమర్శలుకు తగ్గట్లుగా దత్తపుత్రుడి లాగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. అయితే ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దుల్లో గరికపాడు వద్ద పోలీసులు జనసేనానిని అడ్డుకున్నారు. అనంతరం జగ్గయ్యపేట దాటిన తర్వాత ఏపీ పోలీసులు ఆపేశారు. అక్కడకు పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

హైద్రాబాద్ నుంచి విజయవాడకు బాలయలుదేరిన పవన్ కళ్యాణ్ ను జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద పోలీసుల నుంచి ఆటంకం ఎదురైంది. దాంతో ఆయన వాహనం దిగి కాలినడకన మంగళగిరి బయల్దేరారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నంచడంతో పవన్ రోడ్డుపై పడుకున్నారు. పవన్ ను తిరిగి హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జనసేన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ఓ పోస్ట్ చేసింది. ఇందులో జనసేన కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు. వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… మనకు వీసా, పాస్ పోర్ట్ అవసరమేమో అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరినప్పటికీ మళ్లీ అనుమంచిపల్లి వద్ద మరోసారి పోలీసులు జనసేనాని వాహనాన్ని ఆపేశారు.

అంతకుముందు కూడా పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటన రద్దైన విషయం తెలిసిందే. చంద్రబాబును కలిసేందుకు జనసేనాని బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. అయితే శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు ఆయనకు మెయిల్ చేయడంతో, బేగంపేట నుండి ఆయన కాన్వాయ్ వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరారు.

Related posts

పులివెందులలో జగన్ ఓటమే ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు…!

Ram Narayana

అక్టోబర్ 25 నుంచి బస్సుయాత్ర.. మార్చిలో ఎన్నికలు.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో: సీఎం జగన్

Ram Narayana

టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Ram Narayana

Leave a Comment