Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా పార్లమెంటు ఎదుట చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన

  • స్కిల్ కేసులో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
  • టీడీపీ అధినేతకు మద్దతుగా విదేశాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు
  • వాషింగ్టన్ డీసీలో ప్లకార్డులు చేతబూనిన ప్రవాసాంధ్రులు
Rally at US Parliament building in support for Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా, గల్ఫ్ దేశాలు, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాబుకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్కిల్ కేసులో ఈ నెల 9న అరెస్టయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదిస్తూ ప్రపంచ దేశాల్లో  తెలుగువారు గళమెత్తుతున్నారు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి అనేక దేశాల్లో  ఆయనకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోనూ ప్రవాసాంధ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘వాషింగ్టన్ డీసీ ఎన్నారై టీడీపీ’ ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు ఎదుట ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పార్లమెంటు భవనం వద్దకు ఏపీ ఎన్నారైలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిలో పలువురు జనసేన మద్దతుదారులు కూడా ఉన్నారు. ‘బాబుతో నేను’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.

కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన ప్రదర్శన

  • దేశవిదేశాల్లో కొనసాగుతున్న నిరసనలు
  • టొరొంటోలో 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ
  • భారత రాయబారికి వినతిపత్రం
Huge Rally In Toronto Against Chandrababu Naidu Arrest

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా, గల్ఫ్ దేశాలు, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాబుకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

    తాజాగా, కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ ప్రదర్శనలో స్థానికులతోపాటు ఆసియా, అమెరికన్లు కూడా పాల్గొన్నారు. నిజాయతీపరులకు న్యాయం జరగాలని నినదించారు. 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించిన అనంతరం టొరొంటోలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుని భారత రాయబారికి వినతిపత్రం అందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయన వెంటనే జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని అందులో కోరారు. 

Related posts

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఆరేళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన అమెరికన్

Ram Narayana

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపడమెలాగంటే.. అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి వివేక్ రామస్వామి

Ram Narayana

ప్రపంచంలోనే తొలిసారి… మహిళ మెదడులో బతికున్న 8 సెం.మీ. పైథాన్

Ram Narayana

Leave a Comment