Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఢిల్లీలో లోకేష్ …రాజమండ్రిలో బ్రాహ్మణి …చంద్రబాబు అరెస్ట్ పై నిరసన

కళ్లు ఉండీ చూడలేకపోతున్నారంటూ నారా బ్రాహ్మణి ట్వీట్

  • చంద్రబాబు అరెస్టును ఖండించిన బ్రాహ్మణి
  • రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఫైర్

ఢిల్లీలో లోకేష్ …రాజమండ్రిలో బ్రాహ్మణి …చంద్రబాబు అరెస్ట్ పై నిరసన

ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా , బెంగుళూరు లోను నిరసనలు వెల్లు ఎత్తాయి….ఐ ఆమ్ విత్ సి బి ఎన్ అని ప్లే కార్డులు చేబూని నిరసనకారులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు .ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగువారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రదర్శనలు చేశారు …ఆయన కుమారుడు ఆపార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండి జాతీయ మీడియా లో తమ వాణిని వినిపిస్తున్నారు . అదే సందర్భంలో బీజేపీ పెద్దలనుకలిసే పనిలో ఉన్నారు . నేడు పార్లమెంట్ ముందు టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ చేసిన ఆందోళనలో పాల్గొన్నారు . ఇటు ఆయన సతీమణి బ్రాహ్మణి , తల్లి భువనేశ్వరి రాజమండ్రిలో ఉంటూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. కళ్లు ఉండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి వివరణ ఇచ్చారని బ్రాహ్మణి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని, వైసీపీ నేతల తీరు అసమర్థులని మండిపడ్డారు.

ఈమేరకు సోమవారం నారా బ్రాహ్మణి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపెనీలనూ వైసీపీ అపహాస్యం చేస్తోందని బ్రాహ్మణి విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తీరును బ్రాహ్మణి తీవ్రంగా తప్పుబట్టారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ధర్నా

  • పార్టీ ఎంపీలతో కలిసి పాల్గొన్న నారా లోకేశ్
  • ప్లకార్డులతో గాంధీ విగ్రహం ముందు ఆందోళన
  • ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు
TDP MPs Dharna At Parliment Premises

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.

Related posts

‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ…చంద్రబాబు 45 రోజుల ప్రచారం..!

Ram Narayana

ఏపీలో తొలి ట్రెండ్స్ లో కూటమికే ఆధిక్యం ఉండే అవకాశం అంటున్న పరిశీలకులు …!?

Ram Narayana

మంగళగిరిలో జగన్ రోడ్ షో..భారీగా తరలి వచ్చిన జనం …!

Ram Narayana

Leave a Comment