- తొలి విడతలో హైదరాబాద్ సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు
- ఫోన్, వెబ్‌సైట్ లేదా జియో స్టోర్లలో ఈ సేవలు బుక్ చేసుకునేందుకు అవకాశం
- బుకింగ్ చార్జి రూ.100, ఇన్‌స్టలేషన్ చార్జీ రూ.1000
- బుకింగ్ చార్జీని ప్లాన్ మొత్తంలోంచి మినహాయింపు
- రెండు క్యాటగిరీల్లో జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు,
- కొన్ని ప్లాన్లలో ఇన్‌స్టలేషన్ ఉచితం
రిలయన్స్ జియో ఇటీవలే జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఫైబర్ గ్రిడ్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో బ్రాండ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు తెచ్చిన ఈ సర్వీసు ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో ప్రారంభమైంది. త్వరలో ఇతర ప్రాంతాలకు జియో ఎయిర్‌ఫైబర్‌ను రిలయన్స్ విస్తరించనుంది. కేబుల్(సంప్రదాయిక, ఫైబర్ నెట్) ఆధారిత బ్రాండ్‌బ్యాండ్‌కు మంచి ప్రత్యామ్నాయమైన జియో ఎయిర్‌ఫైబర్‌పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరి ఈ సర్వీసు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం..
జియో ఎయిర్‌ఫైబర్‌ను సర్వీసు బుక్ చేసుకునేందుకు 6000860008 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం, జియో వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా దగ్గర్లోని జియో స్టోర్‌కు వెళ్లి సేవలను రిక్వెస్ట్ చేయచ్చు. ఇదివరకే జియో ఫైబర్ ఉన్న వారూ దీన్ని పొందొచ్చు. కనెక్షన్ రిక్వస్టె పెట్టుకున్నాక జియో ప్రతినిధులే కస్టమర్లను సంప్రదిస్తారు. అయితే, బుకింగ్ చేసుకున్నందుకు రూ.100 సర్వీస్ చార్జీ చెల్లించాలి. దీన్ని ప్లాన్ మొత్తంలోంచి మినహాయిస్తారు.
జియో ఎయిర్‌ఫైబర్‌తో నెట్ సేవలతో పాటూ డిజిటల్ ఛానళ్లూ అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం వైఫై రౌటర్, స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్‌ను జియో ఇస్తోంది. వాయిస్ యాక్టివ్ రిమోట్ కూడా ఉంటుంది. సిగ్నల్ కోసం ఇంటిపై యాంటెనాను అమరుస్తారు. ఈ క్రమంలో కస్టమర్లు ఇస్టలెషన్ చార్జీల కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ప్లాన్లు తీసుకున్న వారికి ఇన్‌స్టాలేషన్ ఉచితం.
ప్లాన్లు ఇవీ..
ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్‌కు సంబంధించి రెండు కేటగిరీల ప్లాను ఉన్నాయి. ఫైబర్ ప్లాన్స్ ప్లాన్సేమో రూ.599, రూ.899, రూ.1199 ధరల్లో.. మ్యాక్స్ ప్లాన్స్ రూ.1799, రూ.2499, రూ.3999 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్లాన్‌కు 18 శాతం జీఎస్టీ అదనం. ఇవన్నీ 6 నెలలు, ఏడాది కాలానికి లభించనున్నాయి. అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్ సేవలతో పాటూ 550కి పైగా డిజిటల్ ఛానెళ్లు పొందొచ్చు. ఓటీటీ యాప్స్ కూడా పొందొచ్చు, రూ.1199 ప్లాన్ నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అందుబాటులో ఉంటాయి.