Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య

  • రాజీనామా లేఖను ఖర్గేకు పంపించిన పొన్నాల
  • అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయన్న పొన్నాల
  • కొందరు నాయకుల వల్ల పార్టీ పరువు పోతోందని వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదని చెప్పారు. సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని అన్నారు. సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని చెప్పారు.

 జనగామ టికెట్ ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నాల చాలా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో కూడా పొన్నాలకు చివరి నిమిషంలో టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా కోదండరామ్ కు జనగామ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరకు ఆయన టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన పొన్నాల… తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.

పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించవద్దని కాంగ్రెస్ ఆదేశాలు

  • బీసీలకు పార్టీలో న్యాయం జరగడం లేదంటూ రాజీనామా చేసిన పొన్నాల
  • జనగామ టిక్కెట్‌ రాదనే అసంతృప్తితో రాజీనామా 
  • నేతలకు అధిష్ఠానం నుంచి అంతర్గత ఆదేశాలు 
Congress is not responding on ponnala laxmaiah resignation

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ అధిష్ఠానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పొన్నాల రాజీనామాపై నేతలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాపై ఏమాత్రం మాట్లాడవద్దని చెప్పింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండటమే కాకుండా, మంత్రిగా పని చేసిన పొన్నాల ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ నియోజకవర్గం టిక్కెట్‌ తనకు రాదనే అసంతృప్తితో ఆయన పార్టీని వీడినట్లుగా చెబుతున్నారు. ఈ టిక్కెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందంటున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీనియర్లకు అపాయింటుమెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని పొన్నాల ఆరోపణలు గుప్పించారు.

Related posts

సీపీఎంకు గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాలో సీటు లేదనడం దుర్మార్గం ..తమ్మినేని

Ram Narayana

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి…?

Ram Narayana

Leave a Comment