- ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్ సందర్భంగా సంచలన ఘటన
- చిన్నస్వామి స్టేడియంలో పాక్ జట్టుకు జై కొట్టిన పాకిస్థానీ
- ఈ నినాదాలపై బెంగళూరు పోలీసు అభ్యంతరం
- పోలీసుతో వాగ్వాదానికి దిగిన పాకిస్థానీ
- ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓ పాకిస్థానీ బెంగళూరు పోలీసును నిలబెట్టి కడిగిపారేసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ సందర్భంగా ఆ పాకిస్థానీ ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించడంతో వివాదం మొదలైంది.
పాకిస్థానీ చేస్తున్న నినాదాలు విన్న ఓ పోలీసు అతడిని అడ్డుకునేందుకు వచ్చాడు. అలా అనొద్దని సూచించాడు. దీంతో, సదరు పాకిస్థానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘నేను పాకిస్థాన్ నుంచి వచ్చా. కాబట్టి..పాకిస్థాన్ జిందాబాద్ అంటా. భారత్ మాతా కీ జై అనొచ్చు కానీ పాకిస్థాన్ జిందాబాద్ అనుకూడదా? అక్కడ పాకిస్థాన్ ఆడుతోంది కాబట్టి నేను అలా అన్నాను ఇందులో తప్పేముంది?’’ అని నిలదిశాడు.
ఇక్కడ పాకిస్థాన్ జిందాబాద్ అనకూడదంటూ కెమెరా వంక చూసి చెప్పాలంటూ ఆ పాకిస్థానీ జేబులోంచి కెమెరా బయటకు తీయడంతో పోలీసు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆ ప్రేక్షకుడు పాకిస్థాన్‌కు చెందిన వాడని, మరో దేశ పాస్‌పోర్టుతో ఇండియాకు వచ్చాడని తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా జరుగుతుందా? అంటూ కొందరు పాక్ జాతీయులు నెట్టింట సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.