Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖబర్దార్ తుమ్మల అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..మంత్రి అజయ్..

ఖబర్దార్ తుమ్మల అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..మంత్రి అజయ్…
కేసీఆర్ భిక్ష పెట్టకపోతే నువ్వు అవుట్ డేటెడ్ తుమ్మలపై అజయ్ ఫైర్
వందల ఎకరాలు సంపాందించి మమ్ములను నిందిస్తావా …
కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానని అంటావా ..?
ఏనాడైనా జై తెలంగాణ అన్నవా….
నిన్ను ఓడించడానికి కేటీఆర్ డబ్బులు ఇవ్వడమేమిటి సోయివుండే మాట్లాడుతున్నావా ..
నీతిమాలిన రాజకీయాలు చేస్తూ నిస్సుగ్గుగా మాట్లాడటమా …? మంత్రి అజయ్
జిల్లాలో పార్టీని బ్రష్టు పట్టించేందే తుమ్మల,పొంగులేటి …ఎంపీ వద్దిరాజు
నన్ను నువ్వు గెలిపించావా…ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా…నామ
తుమ్మల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది ..ఎమ్మెల్సీ మధు
నేను ఒక్కరూపాయి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
తుమ్మల పై బీఆర్ యస్ నేతల మూకుమ్మడి దాడి…

ఖబర్దార్ తుమ్మల నీ అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ….కేసీఆర్ నిన్న జీళ్లచెరువు సభలో అన్నదాంట్లో తప్పేముంది ఉన్నదే కదా అన్నారు . దానిపై నీ నోటికి ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడతావా..? అని బీఆర్ యస్ ఖమ్మం జిల్లా అగ్రనేతలు తుమ్మల పై మూకుమ్మడిగా దాడిచేశారు …మంత్రి అజయ్ మాట్లాడుతూ ఒకాయన డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారు…. తుమ్మల కు ఏమి అన్యాయం చేశాం మూలన కుర్చున్నాయని పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి తర్వాత పాలేరు ఉపఎన్నికల్లో గెలిపించింది వస్తాం కదా ..?అని ప్రశ్నించారు …వాస్తవాలు మాట్లాడితే భుజాలు తడుముకోవడం ఎందుకు ….కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానని చెప్పడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు …నువ్వేమిటి ఇప్పించేదేమిటని అంటున్నారు ..కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకపోతే నువ్వు అవుట్ డేటెడ్ పొలిటిసిన్ ఆయ్యేవాడివి … అసలు ఏనాడూ అయినా జై తెలంగాణ అన్నవా…? తెలంగాణ అన్నవాళ్లను జెల్లో పెట్టించిన చరిత్ర నీది …మంత్రిగా వందల ఎకరాలు సంపాదించిన నువ్వు నేను భూకబ్జాలు చేశానని గవర్నమెంట్ స్థలాలు పొందానని మాట్లాడటం సిగ్గు చేటు…నేను బరా బార్ గా 59 జి ఓ ప్రకారం కాలేజీకోసం దారి తీసుకున్నాను …

ఖమ్మం జిల్లాలో ఒక్క ప్రాజక్టు అయినా నిర్మించని నువ్వు అభివృద్ధిని గురించి మాట్లాడటమా అంటూ తుమ్మలపై మంత్రు పువ్వాడ ఘాటు విమర్శలు చేశారు .. పొంగులేటి ,తుమ్మల కొట్టుకొని జిల్లాలో పార్టీని బద్నామ్ చేశారు .

నా మంత్రి పదవి కోసం కందాలకు కేటీఆర్ డబ్బులు ఇవ్వడం ఏమిటి..? తెలిసి మాట్లాడుతున్నావా లేకా అజ్ఞానం తో మాట్లాడుతున్నావా..? లేక ఏదో అనలి కాబట్టి అంటున్నవా..? కొంచం సోయితో మాట్లాడు తుమ్మల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

బాచుపల్లి మమత కాలేజ్ విషయంలో కేటీఆర్ భాగస్వామ్యం అని అంటున్నారు. అసలు నీకు ఎడ్యుకేషనల్ సొసైటీ గురించి తెలుసా.. ఖమ్మం కళాశాలను విస్తరించి హైద్రాబాద్ లో పెట్టిన. దానిలో వాటాలు ఎలా ఉంటాయి..? అనేది తెలుసా అని నిలదీశారు ..

నువ్వూ నిజాయితీ పరుడవు అని చెప్పుకుంటున్నవ్.. నువ్వూ నిజంగా నిజాయితీ పరుడివి అయితే ఫామాయిల్ తోటలు అన్ని ఎక్కడివి..? బీఆర్ యస్ లో మంత్రి పదవి కి ముందు.. మంత్రి పదవికి తరువాత ఎన్ని వందల ఎకరాలు సంపాదించావు.. మర్చిపోయావా తుమ్మల ..?నీ రాజకీయ జీవితం గురించి ప్రజలకు బాగా తెలుసు. ఎంత మంది రాజకీయ నాయకులను బొంద పెట్టవు.. ఎంత మంది రాజకీయ జీవితం నాశనం చేశావు.. ఎంత మందిని రాజకీయ హత్యలు చేశావో ఆ లెక్కలు అన్ని ప్రజలకు, మీ వల్ల నష్ట పోయిన నాయకులకు తెలుసు. కెసిఆర్ అన్నది కరెక్ట్.. నీ నాలుకకు నరం లేదు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు. అడ్డదిడ్డమైన మాటలు నీకే సాధ్యం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుభవించాల్సిన అనేక పదవులు స్వార్థంతో సొంత పార్టీ ఎమ్మేల్యే లను ఓడగొట్టి నువ్వు ఒక్కడివే అనుభవించావు. మొదట సైకిల్.. తరువాత కారు.. ఇప్పుడు చేతి గుర్తు.. నీ నిబద్ధత ఏమిటో ఇక్కడే అర్థం అవుతుందని విమర్శలు గుప్పించారు .
కేవలం పదవుల కోసమే తప్ప ప్రజలకు మంచి చేయాలని నీకు ఎప్పుడు లేదు. నిజంగా పదవులు అవసరం లేదు అన్నొడివి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఎమ్మేల్యే పదవి కోసం ఆరాటపడరు.

ఎంపి వద్దిరాజు రవిచంద్ర…..

పొంగులేటి, తుమ్మల ఇద్దరు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరి పార్టీని నాశనం చేయాలని చూశారని అన్నారు .కెసిఆర్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి వెన్ను పోటు పొడిచింది మీరు ఇద్దరే కదా అన్నారు . పాలేరు సీట్ కావాలి ఆని పోరాడి, పోటీ చేస్తా అని చెప్పి దాన్ని వదిలి ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నావు.. ఖమ్మం కు పోటీ చేస్తున్నావు. ఇది ని స్వార్థం కాదా.. ప్రజలపై అభిమానం ఉన్నొడిలా చెప్తుంటే నవ్వొస్తుంది.

మీరు వచ్చిన తరువాత బీర్ యస్ పార్టీ నీ గెలిపించారు అని అంటున్నారు. మీరు సొంతంగా పోటీ చేసి గెలవండి అప్పుడు మీ శక్తి యుక్తులు ప్రజలకు తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు ఎదో మాట్లాడుతున్నారు. ప్రజలు మీ నిబద్ధత గుర్తించారు. మీ స్వార్థ రాజకీయాలు గుర్తించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇంట్లో కూర్చోబెడతారు.

ఎంపి నామా నాగేశ్వర రావు ….

కెసిఆర్ అన్న మాటలు 100 కు 100 శాతం కరెక్ట్. తెలంగాణ బిల్లు పెటినప్పుడు స్వరాష్ట్రం కోసం మొదటి ఓటు వేసిన వ్యక్తిని నేను. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, నా నిబద్ధత వల్ల ఎంపీగా అఖండ మెజారిటీ సాధించా. అధి కూడా నువ్వే గెలిపించావూ అని అంటున్నావు. ఇంత కంటే సిగ్గు చేటు మరొకటి ఉంటదా నామ తుమ్మల పై ఫైర్ అయ్యారు నేను నిజాయితీతో నా రాజకీయ జీవితం కొనసాగించా.. రాజకీయాలకు రాక ముందు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్న అధి తెలుసుకోని మాట్లాడాలని తుమ్మలకు హితవు పలికారు …

MLC తాతా మధు….

పాలేరులో కెసిఆర్ చెప్పిన అన్ని మాటలు అక్షర సత్యం…ఈ జిల్లాలో పదవులు అనుభవించి వేరే పార్టీలోకి చేరి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది మీ వ్యవహారం….కెసిఆర్ కు మంత్రి పదవి ఇప్పించానని సిస్సిగ్గుగా అన్నావు. అసలు కేసీఅర్ కు నువ్వు మంత్రి పదవి ఇప్పించడం ఎంటి..?…తెలుగు దేశం ప్రభుత్వంలో నీకు మంత్రి పదవి ఎలా వచ్చిందో చెప్పమంటావా….ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళక ముందే నువ్వు నాతో నేను పోటీ చేస్తా చెప్పింది నువ్వు కదా… గతం మర్చిపోకు. మళ్లీ గతిలేక నన్ను కెసిఆర్ నిలబెట్టాడు అని చెబుతావా…బీఆర్ యస్ పార్టీ అభ్యర్థులను దగ్గరుండి ఓడించినది మీరు కాదా..? నిన్ను ఓడించింది పొంగులేటి అని నువ్వే స్వయంగా చెప్పి ఇప్పుడు ఇద్దరూ కలిసి చెట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నారు. జనాలు చుసి నవ్వుకుంటున్నారు.

మధన్ లాల్ ….

వైరా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తే పొంగులేటి వేరే వ్యక్తిని నిలిపి నా పరాజయానికి కారకులు అయ్యాడు….తుమ్మల ను దగ్గరుండి ఓడగొట్టింది కూడా పొంగులేటి నే కానీ ఇవాళ విచిత్రంగా ఇద్దరు కలవడం ఆశ్చర్యంగా ఉంది….కేసీఅర్ ని అనే స్థాయి నీకు లేదు.. నీ లాంటి వాళ్ళను ఉద్యమ సమయంలోనే కోకొల్లలు చూశారు….ధనభలంతో ఉన్న మీరు భవిష్యత్తులో ప్రజలు గెట్టిగా బుద్ధి చెబుతారు.

ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి

నిన్న ముఖ్యమంత్రి కేసీఅర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. జరిగిందే కదా చెప్పింది.
మనం ప్రజలకు ఆదర్శంగా వుండాలి. ప్రజలకు అన్ని తెలుసు …నేను 2014 తరువాత ఎమ్మెల్యే అయిన తరువాత ఎదైన కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకుంట. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయవద్దు….ఇంతే నా మీ రాజకీయ అనుభవం.. మీ రాజకీయ విజ్ఞత అంతే అని అర్దం అవుతుంది అని అన్నారు ..

Related posts

మాది ప్రజాప్రభుత్వం…ప్రజారంజక పాలన అందిస్తాం డిప్యూటీ సీఎం భట్టి !

Ram Narayana

తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

Ram Narayana

ఎన్నికల్లో మద్దతు కోరిన కిషన్ రెడ్డి.. చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment