Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుతెలంగాణ వార్తలు

పోరు ఉత్కంఠమా …?వన్ సైడేనా …??

తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఒకే దఫాగా పోలింగ్ నేడు జరుగుతుంది .. అందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది …. ఓట్లను దేవుళ్ళు తమ అభిప్రాయాలను బటన్ నొక్కడం ద్వారా బాక్స్ ల్లో నిక్షిప్తం చేస్తున్నారు .. ఈసారి ఎన్నికల సంఘం కల్పించిన విస్తృత ప్రచారం వల్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది… పోరు ఉత్కంఠంగా జరుగుతుందా .. …? వన్ సైడేనా …?? అనేది ఆసక్తిగా మారింది … ఒక పక్క అధికార బీఆర్ యస్ ,మరో పక్క కాంగ్రెస్ హోరా హోరీగా ఢీకొంటున్నాయి….బీజేపీ తమ అధికారంలోకి వస్తామని చెప్పినప్పటికీ వారి మాటలు ప్రజలు పెద్దగా విశ్వసించినట్లు లేదు …బీఎస్పీ ,ఎంఐఎం ,కమ్యూనిస్టులు స్వతంత్రులు పోటీలో ఉన్నారు . డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఎన్నికల ఫలితాలు ఉంటాయి . ఎన్నికల సంఘం చేసిన పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగు జరుగుతుంది… ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని వివరాలు…. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799. ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 – 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు దాదాపు పది లక్షల మంది ఉన్నారు…119 నియోజకవర్గాల్లో 2,290 మంది బరిలో ఉన్నారు. పురుషులు 2,068 కాగా మహిళలు 221 మంది. ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు…. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోను ఓటరు స్లిప్పులు.. నమూనా బ్యాలెట్లు ఉన్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు…. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు…పోలింగ్ కోసం 1,85,000 సిబ్బంది, 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు….ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది… తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

Related posts

వైసీపీ కంచుకోట‌లో టీడీపీ విజ‌యం…

Ram Narayana

మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు!

Ram Narayana

బీఆర్ యస్ ,కమ్యూనిస్టుల మధ్య పొత్తు పై ముందుకు పడని అడుగులు …!

Ram Narayana

Leave a Comment