కేసీఆర్ కుట్రలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది … అధికారులు అవకాశం ఇవ్వొద్దు ..భట్టి
ఓడిపోతావని సర్వేలు ఘోషిస్తున్న బింకాలు పోతున్న కేసీఆర్
కేసీఆర్ 3 వ తేదీన మాజీ కావడం ఖాయం
లక్షల కోట్ల విలువైన భూములు బీఆర్ యస్ నేతలు కాజేయాలని చూస్తున్నారు
అధికారులారా ..తస్మాత్ జాగ్రత్త
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు ,అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని అధికారులు వాటికీ అవకాశం ఇచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు …శుక్రవారం హైద్రాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడి హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించి ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి బిఆర్ఎస్ పాలకులు కసరత్తు చేస్తున్నారు అన్నారు …లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు ప్రభుత్వానికి చెందకుండా బీఆర్ఎస్ అక్రమంగా కాజేయాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు ..రెవిన్యూ శాఖను అప్రమత్తం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం ధరణిలో తప్పుగా రిజిస్ట్రేషన్లు చేయొద్దు అన్నారు ..
ఈనెల 3 తర్వాత బిఆర్ఎస్ సర్కార్ ఉండదు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టుగా అధికారులు భూములను ధరణిలో తప్పుగా నమోదు చేసిన బిఆర్ఎస్ పాలకుల బినామీలకు రిజిస్ట్రేషన్ చేసిన చర్యలు తప్పవున్నారు ….ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినప్పటికీ రైతు బంధు రైతుల ఖాతాల్లో వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం కావాలని కుట్రలు చేసి అడ్డుకుందని పేర్కొన్నారు …
రైతుబంధు డబ్బులను ఎన్నికల్లో వనరులు సమకూర్చిన కాంట్రాక్టర్లకు కమిషన్లు దండుకొని వేల కోట్ల బిల్లులు రిలీజ్ చేయడానికి బిఆర్ఎస్ పాలకులు సిద్ధపడినట్లు సమాచారం ఉందని అన్నారు . ఇది రాష్ట్ర ఖజానాకి, ప్రజల సంపదకు నష్టం జరుగుతుందని అన్నారు .కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు నిర్ణయాలు చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు ..
ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అధికార బదిలీ అవుతున్న క్రమంలో అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ..అధికారులు బిఆర్ఎస్ ట్రాప్ లో పడవద్దు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడిలకు లొంగి తప్పులు చేయొద్దన్నారు ..బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు తప్పుల తడకపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రివ్యూ చేస్తుంది బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు …
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగే సమయంలో కాంగ్రెస్ ఏజెంట్లు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ..కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన చోట గెలవలేదని ఓటమి చెందారని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసిన దాఖలాలు ఉన్నవిషయాన్ని గుర్తు చేశారు …
గతంలో తుంగతుర్తి హుజూర్నగర్ మంచిర్యాల ఇబ్రహీంపట్నం ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థులు తక్కువ మెజార్టీతో గెలిచిన ఓటమి చెందారని బిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలకు చూపించిందన్నారు …
ప్రస్తుతం ఉన్న అపధర్మ బిఆర్ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ తర్వాత పూర్తిగా అధికారాన్ని కోల్పోతుందన్నారు … ఈ క్రమంలో ఎలాంటి ఆగడాలు తప్పిదాలు చేయడానికి అయినా సిద్ధపడి ఉంటారని వాటిని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు …
ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నుంచి సర్టిఫికెట్ ఇచ్చేవరకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు … మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని కెసిఆర్, కేటీఆర్ బింకం మాటలు చెబుతున్నారని వారి మాటలు నమ్మవద్దని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు …కౌంటింగ్ జరిగే చోట అవకతవకలు పాల్పడడానికి మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతున్నదన్నారు …