Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లాలో ఘోరం… ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

  • స్నేహితుడే హత్య చేసినట్లుగా ఆరోపణలు
  • ప్రసాద్, అతని భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ల హత్య
  • సినిమా టిక్‌గా ఒక్కొక్కరినీ హత్య చేసిన నిందితుడు

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది స్నేహితుడేనని తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురైనట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్‌ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు.

 వివరాల ప్రకారం… ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్‌పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి… అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకు వెళ్లాడు. బాసర వద్ద గోదావరిలోకి ఆమెను తోసేశాడు. ఆ తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి… ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకువెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Related posts

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం… మాజీ మిస్ కేరళతో పాటు మాజీ రన్నరప్ కూడా మృతి!

Drukpadam

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై మహిళా కమిషన్ సీరియస్… ఎందుకంటే…!

Drukpadam

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం … 5 నుంచి భారీగా బదిలీలు!

Ram Narayana

Leave a Comment