అసెంబ్లీ ఎన్నిలలో వీడియో గ్రఫీ చేసినవీడియో గ్రాఫ్రార్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి..
ఖమ్మం జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేములురి.నాగరాజు దేవర
అసెంబ్లీ ఎన్నిలలో రాత్రనక పగలనక కష్టపడి వీడియో గ్రఫీ చేసిన వీడియో గ్రాఫర్స్ కు జిల్లా అధికారులు డబ్బులు చెల్లించకపోవడంపై వీడియో గ్రాఫర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు …తమకు రావాల్సిన డబ్బులు అడుగుతుంటే రేపు మాపు అని తిప్పుకుంటూ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని అంటున్నారు ..అధికారుల మాటమీద నమ్మకంతో తాము పనిచేస్తే డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం దారుణమని అన్నారు …గతంలో కూడా వీడియో గ్రఫీ చేశామని అప్పుడు అధికారులు వెంటనే నిధులు రిలీజ్ చేసి ఇచ్చేవారని గుర్తు చేశారు ..వీడియో గ్రఫీ చేసిన వీడియో గ్రాఫ్రార్స్ అందరకీ తక్షణమే బకాయిలు చెల్లించాలని ఖమ్మం జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేములురి.నాగరాజు దేవర డిమాండ్ చేశారు..ఎన్నికలు జరిగి ఇరవై రోజులు గడుస్తున్న ఇంతవరకు అధికారులు ఎలక్షన్ ఆఫీస్ చుట్టూ తిప్పు కుంటున్నారని ,జాయింట్ కలక్టర్ మరియు ఎన్నికల అధికారుల సమక్షంలో కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు యెనిమిది గంటల షిఫ్ట్ కు 1500 చొప్పున.వెంటనే చెల్లించాలని తెలిపారు. లేనిచో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు..ఈ సందర్భముగా జిల్లాలోని 5 నియోజకవర్గాలలో నియోజకవర్గల ఎన్నికల
ఇంచార్జులు కమటం రఘు. వీరన్నగౌడ్ ,బాలాజీ నాయక్.రామారావు.స్వామీ , రాము. కనకా చారి.శ్రీకాంత్. యాసిన్ .జగదీశ్. రామ్మూర్తి 21 మండలాల వీడియో గ్రఫర్లు పాల్గొన్నారు.